telugu navyamedia
సినిమా వార్తలు

మహర్షి : నువ్వే సమస్తం వీడియో లిరికల్ సాంగ్

maharshi

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా, సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం “మహర్షి”. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగి సినిమాపై అందరిలో భారీ అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన “నువ్వే సమస్తం…” అంటూ సాగే వీడియో లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు చిత్రబృందం. మీరు కూడా ఈ పాటను వీక్షించండి.

Related posts