telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

థియేటర్స్ ఓపెన్ కాకపోవడానికి కారణం ఎవరు…?

కరోనాకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుని థియేటర్స్ ఓపెన్ చేసుకోండి అంటూ తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్స్ పాస్ చేసింది. ఏపీ ప్రభుత్వం కూడా థియేటర్స్ ఓపెనింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రభుత్వం నుంచి దీనిపై అధికారిక లేఖ కూడా విడుదలైంది. కానీ దర్శక నిర్మాతల నుంచి మాత్రం స్పందన రావడం లేదు. అయితే టాలీవుడ్ లో థియేటర్లు ఓపెన్ కాకుండా బడా నిర్మాతలు అడ్డుపడుతున్నారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి సినిమా హిట్, ప్లాప్ అనేవి మిగితావారికి ఎలా వున్నా నిర్మాత విషయంలో మాత్రం పెద్ద ప్రభావమే చూపుతుంది. నిజానికి నిర్మాత చెక్కుల మీద సంతకాలు పెట్టడం తప్ప పెద్దగా గౌరవాన్ని కూడా కోరుకోడు. సినిమా సక్సెస్ లో నిర్మాత పేరు వినిపించడం చాలా అరుదు. సినిమా వీలైంత తొందరగానే రిలీజ్ చేయాలని ప్రతి నిర్మాత అనుకుంటాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. పెట్టిన డబ్బులైన వచ్చే అవకాశం ఉందాం అని లెక్కలు వేసుకుంటున్నారు. మరికొందరు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ తో ఓటిటి ఫ్లాట్ ఫామ్ లోకి కూడా వెళ్తున్నారు. ప్రస్తుతం నిర్మాతలు ఒకటి రెండు పెద్ద సినిమాలతో ప్రేక్షకులను అంచనా వెయ్యచ్చు అన్నట్టుగా ఎదురుచూస్తున్నారు తప్ప, ఎవరు కూడా ధైర్యం చేసి ముందుకు రావడం లేదు. డిసెంబర్ లోనైనా ముందుకురాకుంటే నిర్మాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశం కనిపిస్తుంది.

Related posts