telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“నిశ్శబ్దం” నుంచి అనుష్క ఫస్ట్ లుక్ విడుదల

Silence

హేమంత్ మధుకర్ దర్శక‌త్వంలో అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రధారులుగా “నిశ్శబ్దం” అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర నిర్మాత‌లు టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, వివేక్ కూచిభోట్ల‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, ఇంగ్లీషు, హిందీతో పాటు మ‌ల‌యాళంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలినీ పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌, హంట‌ర్ ఓ హ‌రో కూడా నటిస్తున్నారు. అనుష్క నటిస్తోన్న “నిశ్శబ్ధం” చిత్రాన్ని మిగతా భాషల్లో “సైలెన్స్” పేరుతో విడుదల చేయనున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. తాజాగా ఈ చిత్రంలో నుంచి అనుష్క ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు చిత్రబృందం. ఇందులో అనుష్క పెయింటింగ్ వేస్తున్న‌ట్టుగా ఉంది. టైటిల్‌కి “సాక్షి… మ్యూట్ ఆర్టిస్ట్… ఆమె మాట్లాడలేదు.. కానీ, ఆమె కళ మాట్లాడుతుంది” అనే క్యాప్ష‌న్ జ‌త చేశారు. అంటే అనుష్క సాక్షి పాత్ర‌లో మూగ‌మ్మయిగా కన్పిస్తుంది అని అనుకుంటున్నారు. అనుష్క పెయింటింగ్ ద్వారానే మ‌న‌సులోని మాట‌ల‌ని చెబుతుందని చెప్పుకుంటున్నారు. ఈ ఫస్ట్ లుక్ లో అనుష్క కొత్తగా, అందంగా కన్పిస్తోంది.

Related posts