telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అల్లు అర్జున్ సిస్టర్ గా వరల్డ్ ఫేమస్ భామ !

Ishwarya-Rajesh

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అందరికీ సుపరిచితమే. ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలతో ప్రేక్షకులను అరిస్తారు. అయితే తాజాగా అర్జున్ చేస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాను స్టార్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో లక్కీ బ్యూటీ రష్మికా హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో తారాస్థాయి అంచనాలు ఉన్నాయి.  అటు ఇప్పటికే  “ఇంట్రడ్యూసింగ్‌ పుష్ప రాజ్” అంటూ యూనిట్ ఈ వీడియో రిలీజ్‌ చేసింది. ఇందులో బన్నీ ఊర మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. అల్లు అర్జున్‌ తగ్గేదే లే అనే డైలాగ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ తో పుష్ప మూవీ మరో రేంజ్‌ కు వెళ్లింది.  ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, బన్నీ సోదరి పాత్రలో కనిపించబోతుందట. ఐశ్వర్య సెంటిమెంట్ ట్రాక్ సినిమాలో కీలకం అంటున్నారు. ఆమె చావుకి బన్నీ రివేంజ్ తీర్చుకోవడమనే అంశం హైలైట్ అవుతుందట.

Related posts