telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఫ్లాప్ సినిమాల రికార్డులను బ్రేక్ చేయలేకపోయిన “సైరా”

Syeraa

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో అత్యంత్య ప్రతిష్టాత్మకంగా 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “సైరా”… చరిత్ర గుర్తించని వీరుడి కథ అంటూ అక్టోబర్ 2 మహాత్మగాంధీ జయంతి రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా డైరక్షన్, మెగాస్టార్ చిరంజీవి నటన, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్ని సినిమాను కాపాడాయని చెప్పొచ్చు. అయితే అసలు కథకు మసాలా కోటింగ్ ఎక్కువైందన్న టాక్ నడుస్తోంది. సినిమాలో భారీ తారాగణం ఉండడంతో ఇక రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ఖాయం అని అనుకున్న మెగా ఫ్యాన్స్ కు “సైరా” నిరాశ పరిచింది. ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి ఒక స్టార్ హీరో ఉన్నా కూడా యూ.ఎస్ ప్రీమియర్ విషయంలో సైరాకు చివరికి నిరాశే మిగిలింది. ఉదయాన్నే సినిమాకి వచ్చిన టాక్, ముందునుంచి ఉన్న హైప్ నేపథ్యంలో బాహుబలి తర్వాత స్థానంలో… లేదంటే కనీసం టాప్-5 లో అయినా ఉంటుందని భావించిన ఈ చిత్రం యూ.ఎస్ ప్రీమియర్స్ లో భారీగా చతికిలపడింది. బాహుబలి 2 చిత్రం ప్రీమియర్ షోల ద్వారా 2.5 మిలియన్ డాలర్లను వసూలు చేయగా అజ్ఞాతవాసి, బాహుబలి చిత్రాలు 1.52 మిలియన్ డాలర్లు రాబట్టి రెండు, మూడు స్థానంలో నిలిచాయి. కనీసం ఆ తర్వాతి స్థానంలో నిలుస్తుందని ఊహించిన “సైరా” కనీసం 5వ స్థానంలో కూడా లేకపోవడం గమనార్హం. చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్.150 1.29 మిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో ఉండగా… మహేష్ బాబు భారీ డిజాస్టర్ సినిమా ‘స్పైడర్’ ఒక మిలియన్ డాలర్లతో 5వ స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో ప్రభాస్ ‘సాహో’ 9.15 లక్షల డాలర్లను రాబట్టింది. సాహో తర్వాత స్థానంలో నిలిచిన ‘సైరా’ 8.53 లక్షల డాలర్లతో సరిపెట్టుకుంది. వీకెండ్ కాకపోవడం, ఇతరత్రా కారణాల వల్ల సినిమా ప్రీమియర్ షో కలెక్షన్స్ విషయంలోసైరా కు భారీ షాక్ తగిలిందనే చెప్పాలి.

Related posts