telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

భూమికి చేరువలో … భారీ గ్రహం..

another huge planet near earth found

భూమికి చేరువలో ఓ భారీ గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. భూగోళంతో పోలిస్తే దాని పరిమాణం మూడు వేల రెట్లు ఎక్కువ. పాలపుంతలోనే ‘బీటా పిక్టోరిస్‌’ అనే నవజాత నక్షత్రం చుట్టూ అది పరిభ్రమిస్తోంది. ‘బీ పిక్టోరిస్‌ సీ’గా నూతన గ్రహానికి నామకరణం చేశారు. భూమికి 63 కాంతి సంవత్సరాల దూరంలో ‘బీటా పిక్టోరిస్‌’ ఉంది. దాని వయసు కేవలం 2.3 కోట్ల ఏళ్లు. సూర్యుడి వయసు(450 కోట్ల ఏళ్లకుపైనే)తో పోలిస్తే ఈ నక్షత్రం చాలా చిన్నది. పరిమాణంలో మాత్రం అది సూర్యుడికి రెట్టింపు ఉంటుంది.

బీటా పిక్టోరిస్‌ చుట్టూ పరిభ్రమిస్తున్న ‘బీ పిక్టోరిస్‌ బీ’ గ్రహాన్ని 2009లోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా ‘బీ పిక్టోరిస్‌ సీ’ని కనుగొన్నారు. నక్షత్రం చుట్టూ దాదాపు 1,200 రోజులకు ఒకసారి ఈ భారీ గ్రహం పరిభ్రమణాన్ని పూర్తిచేస్తోంది. సూర్యుడు-భూమి మధ్య దూరంతో పోలిస్తే.. బీటా పిక్టోరిస్‌, బీ పిక్టోరిస్‌ సీ మధ్య దూరం 2.7 రెట్లు అధికమని ఫ్రాన్స్‌కు చెందిన ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌’ శాస్త్రవేత్త మేరీ లగ్రాంజే తెలిపారు. బీ పిక్టోరిస్‌ బీ, బీ పిక్టోరిస్‌ సీ గ్రహవ్యవస్థలు రెండూ ఇంకా పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోలేదని వెల్లడించారు.

Related posts