telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

వృత్తి జడ్జి.. చేసేదేమో… వరకట్న వేధింపులు..! చదివితే ఉన్నమతి పోయిందంటే ఇదే.. !!

even ex judge can facing dowry case

ఒక జడ్జి అయిఉంది వరకట్న కేసు ఎదుర్కొంటున్నాడు ఈ హైకోర్టు రిటైర్డ్ జడ్జి, జస్టిస్ నూతి రామ్మోహనరావు. ఆయన కోడలు, తన భర్త అత్తామామలు కలిసి తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని రామ్మోహన్ కోడలు సింధు శర్మ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. రామ్మోహనరావు భార్య విజయలక్ష్మి, కుమారుడు వశిష్టపై 498-ఏ, 406, 323 ఐపీసీ సెక్షన్‌-4, అండ్‌ 6ఆఫ్‌ డీపీ యాక్టు కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జస్టిస్ నూతి రామ్మోహన రావు తన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని జర్నలిస్టు కాలనీలో నివాసముంటున్నారు. ఆయన కుమారుడు వశిష్ఠకు సింధూశర్మతో 2012లో పెళ్లైంది. వివాహ సమయంలో కట్న కానుకలు కూడా బాగానే ఇచ్చారు. అడిగినంత అప్పజెప్పారు.

అయినా తృప్తి లేకపోగా, పెళ్లై అత్తారింట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఆమెకు వేధింపులు స్టార్ట్ అయ్యాయి. అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి తెచ్చారు.. అది కూడా తీసుకొచ్చింది. అయినా వేధింపులు ఆగలేదు. తన భర్త, ఆత్తామామల వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సింధుకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. పెళ్లైననాటి నుంచి భర్త, అత్తామామలు అదనపు కట్నం కోసం వేధించారని సింధూ శరమ్ ఆరోపించారు. వారు అడిగినట్లు చేయకపోవడంతో తరచూ కొట్టే వారని తెలిపారు. ఈ నెల 20న దారుణంగా కొట్టి చిత్ర హింసలు పెట్టడంతో అది భరించలేక తాను పోలీసులకు ఆశ్రయించాలనని ఆవేదన వ్యక్తం చేశారు.

కట్నం కోసమా… ఇద్దరు ఆడపిల్లలు పుట్టారనా.. ! 20వ తేదీన తీవ్రంగా కొట్టి అనంతరం అపోలో ఆస్పత్రికి తరలించారని బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురికి పిచ్చి పట్టిందని డాక్టర్లను నమ్మించే ప్రయత్నం చేశారని, అయితే డాక్టర్లు ఆమె ఒంటిపై గాయాలను గమనించి మెడికో లీగల్ కేసుగా పరిగణించి తమకు సమాచారం ఇచ్చారని తెలిపారు. వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన బాధితురాలు శనివారం తల్లిదండ్రులతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అత్తింటి వారిపై ఫిర్యాదు చేశారు.

Related posts