telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అఖిల్ తో రొమాన్స్ చేయనున్న కొత్త భామ…!

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కుతోన్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బొమ్మరిల్లు భాస్కర్ ద‌ర్శక‌త్వం వహిస్తున్నారు. బ‌న్నీవాసు, వాసు వ‌ర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలోని అఖిల్ లుక్‌ను ఇప్పటికే విడుదల చేశారు.  అయితే.. ఈ సినిమా తర్వాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తన నూతన సినిమాను చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు అఖిల్. ఇందులో స్పైగా అఖిల్‌ దర్శనం ఇవ్వనున్నాడట. అయితే… ఇందులో అఖిల్‌ సరసన నటించేంది ఎవరనేదానిపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బీటౌన్‌ పేరు వినిపిస్తోంది. కొత్త హీరోయిన్‌ కోసం వెతుకుతున్న సురేందర్‌ బాలీవుడ్‌పై కన్నేశాడు. అంతే అక్కడ కనిపించిన ఓ మోడలింగ్‌ భామని చూసి దర్శకుడు ఫిదా అయిపోయాడట. దీంతో వెంటనే అమ్మడిని ఓకే చేశాడట. ఆమె పేరు వైద్య సాక్షి, బాలీవుడ్‌ మోడలింగ్‌లో రాణిస్తోంది. ఆమెనే అఖిల్‌ సినిమాలో హీరోయిన్‌గా తీసుకురానున్నారట. ఈ సినిమా వచ్చే నెలలో షూటింగ్‌ ప్రారంభం కానుంది.

Related posts