telugu navyamedia
సినిమా వార్తలు

ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు..

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు ఎట్టకేలకు మంజూరు అయ్యింది. ఈ రోజు ఆర్యన్‌ బెయిల్‌పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో దాదాపు 23 రోజులుగా జైలులో ఉన్న ఆర్యన్‌ ఖాన్‌ జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమమైంది. బెయిల్‌ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో మూడు రోజుల నుంచి సుదీర్ఘ వాదనలు కొనసాగాయి.

Aryan Khan case: Bombay High Court to hear Shah Rukh Khan's son bail plea today

ఆర్యన్‌ తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఆర్య‌న్‌ అతిథిగానే క్రూయిజ్‌కు వెళ్లాడని.. ఆర్యన్‌ వద్ద ఎలాంటి డ్రగ్స్‌ లభించలేదని.. డ్రగ్స్‌ తీసుకున్నట్టు కూడా వైద్య పరీక్షల ఆధారాలేవీ లేవని కోర్టుకు తెలిపారు. మ‌రి ఆర్యన్ ఖాన్ వద్ద అసలు ఏమీ దొరకకున్నా అతడి పక్కన ఉన్న వ్యక్తి వద్ద దొరికితే ..ఆర్యన్‌ను అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమో న్యాయస్థానం గుర్తించాలని కోరారు. అతడి వయస్సును దృష్టిలో ఉంచుకొని ఆర్యన్‌కు బెయిల్‌ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.

అయితే ఎన్సీబీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ గురువారం వాదనలు వినిపించారు. ఆర్యన్ ఖాన్ వద్ద డ్రగ్స్ దొరకలేదని ఆయన తరఫు లాయర్ వాదిస్తున్నారని.. కానీ ఈ కేసులో ఆర్యన్ చాలా కీలకమైన వ్యక్తి అని వాదించారు. ఆర్యన్ ఖాన్ గత కొన్నేళ్లుగా మాదకద్రవ్యాలు స్వీకరిస్తున్నాడని, అతడి వాట్సాప్ చాటింగ్‌లో డ్రగ్స్ డీలర్ల నంబర్లు దొరికాయన్నారు. స్నేహితుడి దగ్గర డ్రగ్స్ ఉన్నాయని ఆర్యన్‌కు ముందే తెలుసన్నారు. వాళ్లిద్దరూ ఏం చేసినా కలిసే చేస్తారని.. వారి వాట్సాప్ చాటింగులు చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. ఇరువురు తరపు న్యాయవాదుల వాదనలను విన్న హైకోర్టు విన్న హైకోర్టు ఆర్యన్‌తో పాటు మోడల్‌ మున్‌మున్‌ ధమేచ, ఆర్భాజ్‌ మర్చంట్‌కు కూడా బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.

Bombay High Court Grants Bail To Aryan Khan, Arbaaz Merchantt and Munmun Dhamecha

కాగా..ఈ నెల అక్టోబర్‌ 2వ తేదీ అర్థరాత్రి క్రూయిజ్‌ ఓడరేవు డ్రగ్స్‌ పార్టీలో పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ తనిఖిలో ఆర్యన్‌తో పాటు మరో 8మందిని పోలీసులు అరెస్టు చేసి అప్పటి నుంచి ఆర్యన్‌ దాదాపు 23 రోజుల పాటు జైలులోనే ఉన్నాడు. ఈ క్రమంలో అతడి బెయిల్‌ పిటిషన్‌కు ముంబై కోర్టు మూడు స్లార్లు కొట్టివేసింది. దీంతో ఆర్యన్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించగా చివరికి ఈరోజు బెయిల్ మంజూరు అయ్యింది. దీంతో కుటుంబ సభ్యులతో పాటు ‘బాద్‌షా’ ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకున్నారు.

Related posts