telugu navyamedia
సినిమా వార్తలు

పుట్టిన శుభాకాంక్ష‌లు మ‌హేష్‌..

ఘట్టమనేని వార‌సుడు.. అందాల రాకుమారుడు.. ఫ్రిన్స్‌ మహేశ్ పుట్టిన రోజు ఈరోజు.. మ‌హేష్ అంటే ఒక వైబ్రేష‌న్‌. .అమ్మాయిలకు మ‌న‌సు దోచుకున్న కలల రాజ‌మారుడు. ఇయ‌న‌ సూపర్‌స్టార్‌ కృష్ణ, ఇందిరదేవి దంపతులకు 1975 ఆగస్ట్9న చెన్నైలో జన్మించాడు మహేశ్‌. మహేష్ బాబు మద్రాసులో చదువుకుంటూనే సెలవులలో తన తండ్రి చిత్రాలలో బాలనటుడిగా నటించాడు. మహేష్ బాబు సినిమాల నుండి కొంత కాలం విరామం తీసుకుని లయోలా కాలేజీ నుండి డిగ్రీ పట్టా పొందాడు.

2005 ఫిబ్రవరి 10న ఫెమీనా మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్‌‌ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు పేరు గౌతమ్ కాగా, కూతురి పేరు సితార.

ఇక పోతే సూపర్‌ స్టార్‌ కృష్ణ వారసుడిగా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలనటుడిగా 8 కి పైగా సినిమాల్లో నటించాడు. త‌న తండ్రి న‌డచిన బాట‌లోనే న‌డుస్తూ తనదైన నటనతో టాలీవుడ్ లో ప్రేక్ష‌కుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు.

మొదటి సినిమా రాజకుమారుడు తోనే నంది ఉత్తమ నూతన నటుడి పురస్కారం అందుకున్నాడు. 2003 లో వచ్చిన నిజం సినిమాకు మొదటి సారిగా నంది ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నాడు. తర్వాత 2005 లో వచ్చిన అతడు, 2011 లో వచ్చిన దూకుడు, 2015 లో వచ్చిన శ్రీమంతుడు చిత్రాలకు కూడా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు గెలుచుకున్నాడు.

1983లో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మనవి మేరకు పోరాటం సినిమాలో తన తండ్రి కృష్ణకు తమ్ముడిగా నటించాడు. ఆ తరువాత వరుసగా బాలనటుడిగా ‘శంఖారావం’, ‘బజార్ రౌడీ’,‘ముగ్గురు కొడుకులు’,‘గూడచారి 117’, ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘బాల చంద్రుడు’, ‘అన్న తమ్ముడు’తదితర చిత్రాలతో బాలనటుడిగా రాణించాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో ‘రాజకుమారుడు’(1999) మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా విలక్షణమైన పాత్రలు పోషిస్తూ టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌గా ఎదిగాడు.

కాగా..ప్రస్తుతం మహేశ్‌ బాబు పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్‌ అనంతరం త్రివిక్రమ్‌తో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడు.

Related posts