telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాజమౌళి సొంత ఖర్చుతో శిక్షణ ఇప్పించారు… లేకపోతే… : ‘కాలకేయ’ ప్రభాకర్

prabhakar

‘బాహుబలి’ సినిమాలోని ‘కాలకేయ’ పాత్రను, ఆ పాత్ర పోషించిన ప్రభాకర్ ను ఎప్పటికీ మరిచిపోలేరు. చిత్రమైన వేషధారణతో, విచిత్రమైన భాష మాట్లాడుతూ, క్రూరుడిగా తెరపై కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు ప్రభాకర్. అప్పటి నుంచి ఆయనను ‘కాలకేయ’ ప్రభాకర్ అనే అంతా పిలుస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ “ఒక వ్యక్తి రైల్వేలో జాబ్ ఇప్పిస్తానని ఆశపెడితే మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ వచ్చాను. అతను మోసం చేయడంతో, కూలి పనులు చేస్తూ రోజులు గడిపాను. ఒకసారి ‘అతిథి’ షూటింగు చూడటానికి వెళితే, ఆ దర్శకుడు నన్ను చూసి చిన్నవేషం ఒకటి ఇచ్చాడు. అప్పటి నుంచి దృష్టి సినిమాల వైపుకు వెళ్లింది. రాజమౌళి గారు ‘మర్యాద రామన్న’ సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు. నాకు డైలాగ్స్ కూడా చెప్పడం రాకపోతే, ఆయనే సొంత ఖర్చుతో శిక్షణ ఇప్పించారు. ‘మర్యాద రామన్న’ సినిమా నాకు గుర్తింపు తీసుకు రావడమే కాదు, నా అప్పులన్నీ తీర్చేసింది. ఆ తరువాత చేసిన ‘కాలకేయ’ పాత్ర నుంచి నేను వెనుదిరిగి చూసుకోలేదు. రాజమౌళి గారు నన్ను గుర్తించి అవకాశం ఇవ్వకపోతే, నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది” అంటూ చెప్పుకొచ్చారు.

Related posts