telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సగం గోచీ నువ్వే విప్పుకున్నావ్… నరేష్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Srireddy

“మా” మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. గత ఆదివారం ‘మా’ అధ్యక్షుడు లేకుండానే జనరల్ సెక్రటరీ జీవిత, ఎగ్జిక్యూటివ్ మెంటర్లు కలిసి సమావేశం నిర్వహించడం పెను దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే తన ప్రమేయం లేకుండా సమావేశం నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు నరేశ్. అంతేకాదు సమావేశంపై లీగల్ చర్యలు తీసుకోబోతున్నట్టు చెప్పాడు. ఈ విషయంపై జీవిత, హేమ కూడా నరేష్ తీరును తప్పుబడుతూ ఫైర్ అయ్యారు. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో జరుగుతున్న వివాదంలోకి నటి శ్రీరెడ్డి ఎంట్రీ ఇచ్చారు. మా అధ్యక్షుడు నరేష్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు మాలో పెద్ద దుమారం రేపిన శ్రీరెడ్డి ఇప్పుడు తాజాగా నరేష్, జీవిత రాజశేఖర్ మధ్య జరుగుతున్న వివాదంపై స్పందించారు. మా ఎన్నికల సమయంలో జీవితారాజశేఖర్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి, ఇప్పుడు నరేష్ మీద విరుచుకుపడ్డారు. తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ కామెంట్ పోస్ట్ చేశారు. “నరేష్ సగం గోచీ నువ్వే విప్పేసుకున్నావ్. సగం గోచీ మా మెంబర్స్ లాగేశారు’ అని పోస్ట్ చేసిన ఆమె ఆ తర్వాత మరో బూతం పదం వాడారు.

Related posts