telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రూటు మార్చిన ‘కన్ను గీటు’ భామ

ప్రియా ప్రకాష్ వారియర్ ఈ పేరు అందరకి సుపరిచితమే. అదేంటి గుర్తులేదా? అదేనండీ కన్ను కొట్టి దేశాన్ని తన వలలో పడేసిందే ఆ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్. ఈ అమ్మడు తన మొదటి సినిమాలో కన్న కొట్టి అందరిని తన వెనుక తిప్పుకుంది. ఈ అమ్మడుకు ఒరు అదార్ లవ్ అనే సినిమాతో ఎంత క్రేజ్ వచ్చినీ సినిమా మాత్రం ప్లాప్ అయింది. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో యంగ్ హీరో నితిన్ సరసన చేస్తోంది. ఏ సినమా అనుకుంటున్నారు. యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చెక్ సినిమాలో ప్రియా ప్రకాష్ రెండో హీరోయిన్‌గా చేస్తోంది. ఈ అమ్మడుకి అనుకున్నన్ని సినిమా అవకాశాలు రావట్లేదేమో మరి తనలోని కొత్త ట్యాలెంట్ చూపించడానికి సిద్దమవుతోంది. ఇప్పుడు ఈఅమ్మడు ఈ సినిమా కోసం గాయనిగా మారింది. సంగీత దర్శకుడు పాకాల శ్రీదరణ్ చేస్తున్న ఓ ప్రైవేట్ ఆల్బమ్‌లో ప్రియా ఓ పాట పాడనుంది. మరి ఈ అమ్మడి కొత్త ప్రయాణం ఎంతవరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

Related posts