telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ పాపాలు పండిపోయాయి… ప్రజలు ఇక నమ్మరు !

ponnala lakhmaih

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య నిప్పులు చెరిగారు. కేసీఆర్ పాపాలు కేటీఆర్ కి అంట గడతారని.. అందుకే కేటీఆర్ కి పగ్గాలు .?అంటూ ఫైర్‌ అయ్యారు. సీఎం కేసీఆర్ ది లీకులు.. ప్రెస్ నోట్ల పాలన అని… సమీక్షలు లేకుంటే లీకులు… సమీక్షిస్తే ప్రెస్ నోట్లు అంటూ మండిపడ్డారు. ప్రజలకు చెప్పడానికి ముఖం లేదని.. పాలమూరు రంగారెడ్డి ఏడాదిలో పూర్తి అవుతుందా..? అని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పాలమూరు.. డిండి ప్రాజెక్టు గుర్తొచ్చిందని.. ఆరు నెలలో డిండి పూర్తి అవ్వడం సాధ్యమా..? అని నిలదీశారు. అరేండ్లలో ఊసే లేదు కానీ… ఆరు నెలల్లో పూర్తి చేస్తాడట..? అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాపం పండుతుందని… జనం బుద్ధి చెప్తారన్నారు. కేసీఆర్ కిట్ కి ఐదు వేలు ఇచ్చి… ఒక్కో బిడ్డ మీద లక్ష రూపాయలు అప్పులు వేస్తున్నాడని మండిపడ్డారు. చరిత్ర హీనుడిగా కేసీఆర్ మారబోతున్నారని… పాలమూరు జిల్లాలో ప్రాజెక్టుల వద్దకు వెళదాం వస్తావా ? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన భూములే కోటి 30 లక్షల ఎకరాలు అని… కోటి పది లక్షల ఎకరాల్లో వరి సాగు అయ్యిందని చెప్తున్నారని ఫైర్‌ అయ్యారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు ఎన్ని… ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు… అక్కరకు రాని పనులు చేస్తున్నారు అని మేము అంటుంటే… ఇంకా అదనపు పనులు చేస్తున్నారు కేసీఆర్ అని మండిపడ్డారు.

Related posts