telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

జూన్ 4న రానున్న 83…

83

ప్రస్తుతం సినిమాల్లో బయోపిక్‌ కలం నడుస్తునా విషయం తెలిసిందే. అయితే హీరో రణ్‌వీర్ సింగ్ చేస్తున్న తాజా చిత్రం 83. ఈ సినిమాను భారత సీనియర్ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో రణ్‌వీర్ కపిల్ దేవ్ పాత్రలో కనిపించనున్నారు. అందుకోసం రణ్‌వీర్ క్రికెట్ శిక్షణ తీసుకున్నారు. కపిల్ దేవ్ స్పెషల్ షాట్లను అచ్చం అలానే కొట్టగలగాలని ఎంతగానో శ్రమించారు. అయితే తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమా జూన్4న ప్రేక్షకుల ముందుకు వస్తుందంట. అంతేకాకుండా ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని కబీర్ ఖాన్ దర్శకత్వంలో దీపికా పదుకొణె, కబీర్ ఖాన్, సాజిద్ నడియాద్వాలా, విష్ణువర్థన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం హిందీ ప్రేక్షకులతో పాటు ఇతర భాషల వారు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా దేశ వ్యాప్తంగా తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. చూడాలి మరి రణ్‌వీర్ వారి అంచనాలను ఎంత వరకు అందుకుంటారో… ఈ సినిమా ఎంత మేర అభిమానులను ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

Related posts