దక్షిణాది స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది సమంత, పెళ్ళి తరువాత కూడా ఈ బ్యూటీ వరుస అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉంది. అయితే సినిమాల్లో కెరీర్ మొదలుపెట్టక ముందు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పింది. తాజాగా ట్విట్టర్ లో తన అభిమానులతో ముచ్చటించిన ఈ బ్యూటీ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చింది. పెళ్లి తరువాత కెరీర్ ఎలా ఉందని ఓ నెటిజన్ అడగ్గా… పెళ్లికి ముందు వచ్చినన్ని ఆఫర్లు ఇప్పుడు రావడం లేదని, బహుశా తనతో ఎలాంటి సినిమా చేయాలో తెలియడం లేదనుకుంటా… అని నవ్వేసింది. తనపై వచ్చిన గర్భవతి వార్తలపై స్పందిస్తూ.. విమర్శలు తనను మొదట్లో చాలా బాధించేవని, మానసికంగా ఎంతో ఇబ్బందిపెట్టేవని, కానీ ఇప్పుడు తను మారిపోయినట్లు, అన్నింటినీ ఫన్నీగా తీసుకుంటున్నానని చెప్పింది. ఓ నెటిజన్.. పిల్లలు, మహిళల వైద్యానికి ఆర్ధిక సహాయం చేస్తున్నారు కదా.. దీనికి కారణం ఏంటని ప్రశ్నించగా.. ”నేను సామాన్య కుటుంబ నేపధ్యం నుండి వచ్చాను. అప్పట్లో ఓ సొంత ఇల్లు, బ్యాక్ అకౌంట్ లో రూ.50 లక్షలు ఉంటే చాలనుకునేదాన్ని.. ఓ విధంగా అదే నా డ్రీమ్.. అది సాదించా.. దానికి మించి దక్కిందంతా నేను కావాలని అనుకున్నది కాదు.. నేను, మా అమ్మ జీవితంలో ఎంతో కష్టపడ్డాం. ఇతరులు వచ్చి మాకు సహాయం చేసిన రోజులు కూడా ఉన్నాయి. నాకు ఆ ఫీలింగ్ తెలుసు.. అందుకే సహాయం చేస్తున్నా” అంటూ చెప్పుకొచ్చింది.
previous post