telugu navyamedia
రాజకీయ సామాజిక

మహిళలకు సౌభాగ్యానిచ్చే శ్రావణ మాస వ్రతాలు..

సృష్టి, స్థితి, లయ కారకులైన త్రిమూర్తులలో స్థితికారుడు, దుష్టశిక్షకుడు, శిష్టరక్షకుడు అయిన శ్రీమహావిష్ణువుకు, ఆయన దేవేరి అయిన శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన, వివిధ వ్రతాలు, పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలు, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసం “శ్రావణ మాసం”

చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవ మాసం ః-
ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం “శ్రవణా నక్షత్రం” అటువంటి శ్రవణా నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీమహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన మాసం. శ్రావణమాసంలోని మూడు వారాలు అత్యంత పుణ్యప్రదమైనవి. “మంగళ, శుక్ర, శనివారాలు” ఈ మాసంలో అత్యంత ప్రధానమైనవి, మహత్తును కలిగినవి. శ్రావణమాసంలోని మంగళవారాలు శ్రీగౌరీ పూజకు, శుక్రవారాలు శ్రీలక్ష్మీ పూజకు, శనివారాలు శ్రీమహావిష్ణువు పూజకు ముఖ్యమైన దినాలు.వీటికితోడు శ్రావణమాసంలోని శుక్లపక్షంలోగల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ, ఒక్కోరోజు ఒక్కో దేవుని పూజ చేయాలని శాస్త్ర వచనం.

పాడ్యమి – బ్రహ్మదేవుడు
విదియ. – శ్రీయఃపతి
తదియ. – పార్వతీదేవి
చవితి – వినాయకుడు
పంచమి – శశి
షష్టి – నాగదేవతలు
సప్తమి – సూర్యుడు
అష్టమి – దుర్గాదేవి
నవమి – మాతృదేవతలు
దశమి – ధర్మరాజు
ఏకాదశి – మహర్షులు
ద్వాదశి – శ్రీమహావిష్ణువు
త్రయోదశి – అనంగుడు
చతుర్దశి – పరమశివుడు
పూర్ణిమ – పితృదేవతలు

2020 – శ్రావణమాస పర్వదినములు
10-08-21 – మంగళగౌరీ వ్రతం
11-08-21 – మధుశ్రవా వ్రతం
12-08-21 – నాగ చతుర్థీ,
దుర్వాగణపతి వ్రతం
13-08-21 – గరుడ పంచమి,
నాగ పంచమి,
శ్రీ కల్కి జయంతి
15-08-21- భారత స్వాతంత్ర్య దినోత్సవం
16-08-21 – తరిగొండ వెంగమాంబ వర్ధంతి
17-08-21 – తిరుమల శ్రీవారి పవిత్రోత్సవ
అంకురార్పణ,
వేదవ్రతారంభం,
సింహసంక్రమణం ప.3-52
మఖ కార్తె ప్రారంభం
18-08-21 – సర్వైకాదశి
20-08-21 – శ్రీ వరలక్ష్మీవ్రతం
21-08-21 – ఋగ్వేదీనాం ఉపాకర్మ
ఓనమ్ పండుగ
22-08-21 – శ్రావణ పూర్ణిమ
రాఖీ పండుగ
శ్రీ విఖనస జయంతి
శ్రీ హయగ్రీవ జయంతి
నూతన యజ్ఞోపవీత ధారణ
తైత్తరీయోపాకర్మ
23-08-21 – గాయత్రీ జపం
24-08-21 – శ్రీ రాఘవేంద్ర ఆరాధన
ఆశూన్య శయన వ్రతం
25-08-21 – సంకష్టహర చతుర్థి
30-08-21 – శ్రీకృష్ణ జన్మాష్టమి
గోకులాష్టమి
31-08-21 – శ్రీ కణ్ణన్ జయంతి
పుబ్బకార్తె ప్రారంభం
02-09-21 – సర్వైకాదశి
04-09-21 – శనిత్రయోదశి
05-09-21 – మాస శివరాత్రి
ఉపాధ్యాయ దినోత్సవం
06-09-21 – పోలాల అమావాస్య
వటసావిత్రీ వ్రతం
కుశ గ్రహణం
సర్వ అమావాస్య
07-09-21 – శైవ మౌనవవ్రతం
08-09-21 నుండి భాద్రపదమాసం

మహిళలకు సౌభాగ్యానిచ్చే శ్రావణ మాస వ్రతాలు ః..
శ్రావణమాసం మహిళలకు అత్యంత ముఖ్యమైనది. మహిళలు పాటించే వ్రతాల్లో అధికం ఈ మాసంలోనే ఉండడంవల్ల వ్రతాలమాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది.

మంగళగౌరీ వ్రతం ః-
శ్రావణమాసంలో ఆచరించే వ్రతాల్లో ముఖ్యమైనది ఈ వ్రతం. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు చేయాలి. నెలలోని అన్ని మంగళవారాలు దీనిని చేయవలెను.

వరలక్ష్మీ వ్రతం ః-
మహిళలకు అత్యంత ముఖ్యమైన శ్రావణమాసంలో ఆచరించే మరో ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను.

శ్రావణమాసంలో వచ్చే పండగలు ః-
శుక్ల చవితి – నాగులచవితి
మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు నాగులచవితి పండుగను జరుపుకుంటారు. ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి పూజిస్తారు.

శుక్ల ఏకాదశి – పుత్రదా ఏకాదశి ః-
ఈ ఏకాదశికే లలితా ఏకాదశి అని కూడా పేరు. పుత్ర సంతానం కావాలనుకునేవారు ఈనాడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం మంచిది.

శ్రావణ పూర్ణిమ – రాఖీపూర్ణిమ ః-
సోదరుడి సుఖసంతోషాలు కోరుతూ అక్కాచెల్లెళ్ళు సోదరుడి చేతికి రాఖీ కడతారు. నుదుట బొట్టు పెట్టి, అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరి ఆశీర్వాదం తీసుకుని కానుకలివ్వడం ఆనవాయితీ. అంతే గాక ఈ దినం పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం.

పూర్ణిమ – హయగ్రీవ జయంతి

Related posts