తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామి ఆలయాన్ని నేడు సందర్శించనున్నారు. త్వరలోనే ప్రధానాలయ ఉద్ఘాటన ముహూర్తం, ఆలయ సన్నిధిలో మహా సుదర్శన యాగం తలపెడుతున్నట్లు సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. సుదర్శన యాగాన్ని దాదాపు వంద ఎకరాల్లో 1048 యజ్ఞ కుండాలతో జరపనుండటంతో ఇందుకు కొండ దిగువన ఆలయం ఉత్తర వైపు గల వైటీడీఏ సమీకరించిన 93 ఎకరాలతో పాటు పెద్దగుట్టపై ఖాళీ స్థలాలను ఆయన పరిశీలిస్తారు. ఉదయం 11గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు చేరుకుంటారు.
అనంతరం బాలాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కొండ చుట్టూ ఆరు వరుసల రింగు రోడ్డును, వీవీఐపీల బసకు ప్రెసిడెన్షియల్ సూట్ల నిర్మాణాలతో పాటు టెంపుల్ సిటీ నలువైపు రహదారుల విస్తరణను పరిశీలించి ఆస్తుల సేకరణపై ఓ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. అనంతరం ఉన్నతస్థాయి అధికారులు, స్తపతులతో సమీక్ష నిర్వహించి ఆలయ ఉద్ఘాటన, మహా సుదర్శన యాగం ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేస్తారని భావిస్తున్నారు.యాదాద్రికి రోడ్డు మార్గంలోనే కేసీఆర్ వస్తారని అధికారులు చెబుతున్నప్పటికీ పెద్దగుట్టపై హెలిప్యాడ్‌ను సిద్ధం చేస్తున్నారు.
మరో రెండు టర్మ్‌లు నేనే సీఎంగా ఉంటా.. అసెంబ్లీలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు