telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

తండ్రైన టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి..

Anushka

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రి అయ్యాడు. ఈ రోజు సాయంత్రం అనుష్క శర్మా పాపకు జన్మనిచ్చిందన్న విషయాన్ని విరాట్ ప్రకటించాడు. దీనిని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. తాను తండ్రి అయిన ఆనందాన్ని విరాట్ కోహ్లీ తన ట్వీటర్ వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ‘ఈ విషయాన్ని మీతో పంచుకోడం చాలా థ్రిల్లింగా ఉంది. ఈ సాయంత్రం మాకు పాప పుట్టింది. అనుష్క, పాప ఇద్దరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. నేటి నుంచి మా జీవితాల్లో మరో కొత్త చాప్టర్ ప్రారంభం కానుంద’ని విరాట్ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ 2017లో వివాహం చేసుకున్నారు. ఇటీవల లాక్‌డౌన్ సమయంలో బేబీ బంప్‌తో తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అనుష్క అభిమానులకు తెలిపింది. నేడు సాయంత్రం పాపకు జన్మనిచ్చింది.

Related posts