telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

సరెండర్ అవుతానని చిదంబరం పిటిషన్..తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు

cbi custody to chidambaram

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోంమంత్రి చిదంబరాన్ని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం ఆయనకు జ్యూడీషియల్ కస్టడి విధించింది. దీంతో పోలీసులు చిదంబరాన్ని ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తానుఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులకు సరెండర్ అవుతానన్న విజ్ఞప్తిని తిరస్కరించింది. చిదంబరానికి ఇంటి భోజనం ఇవ్వాలన్న ఆయన లాయర్ విజ్ఞప్తిని నిన్న ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టిన సంగతి తెలిసిందే. జైలులో అందరూ సమానమేనని కోర్టు అప్పుడు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో తనను తీహార్ జైలు నుంచి ఈడీ కస్టడీకి అప్పగించాలనీ, తాను సరెండర్ అవుతానని చిదంబరం ఈరోజు పిటిషన్ దాఖలు చేశారు.

Related posts