telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

పిల్లలను ఉగ్రవాదానికి.. దూరంగా ఉంచండి; కాశ్మీర్ లో తల్లులకు ఆర్మీ విజ్ఞప్తి.. !

army request to parents in j & k on their children

కాశ్మీర్ పై పట్టు సాధించాలని పాక్ ఎప్పటి నుండో ప్రయత్నిస్తూనే ఉంది. దానిని భారత్ ఎప్పటి కప్పుడు తిప్పికొడుతూనే ఉంది. కానీ, ఈ లోపే ఆక్రమిత కాశ్మీర్ లో యువతను ఉగ్రవాదులుగా తయారుచేసి, వారితోనే కాశ్మీర్ లో రక్షణ శాఖపై, సాధారణ ప్రజలపై దాడులు చేయిస్తుంది పాక్. ఇదంతా ఏళ్లతరబడి జరుగుతూనే ఉన్నా, శాంతి పాఠాలు చెప్పుకుంటూ వస్తున్న భారత్ కు జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంది. తాజాగా జరిగిన పుల్వామా ఘటన తో సహా అక్కడి యువత సరిహద్దులలో అనిచ్చితితో ఉగ్రవాదంపై మొగ్గుచూపడం వరకు పాక్ ప్రణాళికలలో భాగంగానే జరుగుతున్నాయి.

ఇవన్నీ జరుగుతుంటే, నేడు కాశ్మీర్ లో తల్లులకు ఆర్మీ విజ్ఞప్తి ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించినా, రాజకీయనాయకుల చేతిలో వారు కీలు బొమ్మలవటం చేత అంతకు మించి వాళ్ళు ఒక్క అడుగు ముందుకు వేయలేని స్థితిలోనే ఉన్నారు. మొత్తానికి కాశ్మీర్ ఇన్నాళ్ళుగా నేటి, రేపటి తరాల నాశనాన్ని చూస్తూనే ఉంది. ఇదే బహుశా, యువత ఉగ్రవాదంపై మళ్లడానికి ప్రధాన కారణం కావచ్చు. దీనికి భారత్ చర్యలే ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ప్రారంభంలోనే కాశ్మీర్ పై స్పష్టమైన నిర్ణయం తీసుకుని ఉంటె ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఇప్పటికైనా అలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం..! కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం.. దీనిని మాత్రం ఎవరు మార్చలేరు. కానీ, నిజజీవితంలో ఇదొక కలగా మిగిలిపోనుందా..!!కలలో కూడా అలాంటి ఊహ సరైనది కాదు. కాశ్మీర్ భారతదేశానిది.. అంతే.

జమ్ము-కాశ్మీర్ ప్రజలకు ఆర్మీ కొన్ని సూచనలు చేసింది. ముఖ్యంగా కాశ్మీర్ యువత తీవ్రవాదం, హింస మార్గం వైపు మళ్లేలా చూడొద్దని వారి తల్లులను కోరింది. తీవ్రవాద భావజాలం వైపు వెళ్లి తిరిగొచ్చిన వారిని ఏమీ చేయమని స్పష్టంచేసింది. ‘మీ పిల్లలను ఉగ్రవాదానికి దూరంగా ఉంచండి .. ఉగ్రవాద గ్రూపుల్లో చేరేవారిని నిరోధించండి. అలాగే ఉగ్రవాద గ్రూపుల్లో చేరిన యువత తిరిగొచ్చేందుకు సుముఖుత వ్యక్తం చేస్తే .. వారికి ఎలాంటి హానీ తలపెట్టబోం’ అని భారత లెప్టినెంట్ జనరల్ కన్వాల్ జీత్ సింగ్ థిల్లాన్ చెప్పారు. ఉగ్రవాదా భావజాలం వైపు మళ్లిన వారిని ఉగ్రవాదానికి దగ్గర కానీయకండా చూడాలని కోరారు. వారికి అన్నివిధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు.

థిల్లాన్ కాశ్మీర్ లో జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత మాట్లాడుతూ ఉగ్రవాద భావజాలం వైపు మళ్లొద్దని ప్రత్యేకంగా వారి తల్లులను కోరారు. మరోవైపు పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్ర మూకల దాడితో పరిస్థితి మారింది. ఇప్పటికే అలర్టైన సైన్యం … ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని స్పష్టంచేసింది. అలాగే చూస్తూ ఊరుకోబోమని పాక్ కు తేల్చిచెప్పింది. దీనితో పాటు కాశ్మీర్ యువత ఎక్కువగా అతివాద భావజాలంతో ఉగ్రవాదానికి మళ్లుతున్నారు. ఈ క్రమంలో ఈ అంశాన్ని మొగ్గదశలోనే తుంచి వేద్దామని వారి తల్లులకు విజప్తి చేశారు థిల్లాన్.

Related posts