వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు వై సుజనా చౌదరి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ లో పారదర్శకత కనిపించడం లేదని, తూతూ మంత్రంగానే రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తున్నట్లు ఉందన్నారు. ఇటీవల రివర్స్ టెండరింగ్ ద్వారా నిర్వహించిన హైడల్ ప్రాజెక్టు చూస్తుంటే ప్రాజెక్టు మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి ఉందన్నారు. ప్రాజెక్టు పూర్తయ్యే సరికి కనీసం మూడేళ్లు పట్టేయోచ్చన్నారు. 15వేల మెగా వాట్ల విద్యుత్ నష్టం వాటిల్లుతుందని వాటి విలువ 5వేల కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు.
లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి రూ.300 నుంచి 400 కోట్లు అదనపు ఖర్చు అయ్యే అవకాశం ఉందన్నారు. ఇలా చూస్తుంటూ పోతే ప్రాజెక్టు మరింత ఆలస్యం, అధిక ఖర్చు అవ్వడమే తప్ప రివర్స్ టెండరింగ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టులో నెలకొన్న సమస్యలకు దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఆరోపించారు. 2009లో నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును రీ ఓపెనింగ్ చేయడంతోనే సమస్యలు తలెత్తినట్లు చెప్పుకొచ్చారు.
రిటైర్ అయిన వారిని సీఎండీలుగా నియమిస్తున్నారు: రేవంత్