telugu navyamedia
తెలంగాణ వార్తలు

డ్రగ్స్ చాపకింద నీరులా విస్తరిస్తోంది..

*పంజాబ్‌లో ఇంటికి ఒక‌రు డ్ర‌గ్స్‌కు ఆడిక్ట్ అయ్యారు..
*స్కూళ్ళు , కాలేజీల‌కు ఈజీగా డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా అవుతోంది..
*ఉడ్తా పంజాబ్ సినిమాలో చూపిన‌ట్టు ఇంటి ఒక‌రు..
*రాష్ర్టంలో డ్ర‌గ్స్ చాప కింద నీరులా విస్త‌రిస్తుంది..

*నాకు తెలిసిన చాలా మంది పిల్ల‌లు డ్ర‌గ్స్ బానిస‌ల‌య్యారు..
*భ‌విష్య‌త్‌లో దేశంలో రెండు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటాము..

రాష్ట్రంలో డ్రగ్స్ చాపకింద నీరులా విస్తరిస్తుందని హైద‌రాబాద్ సీపీ సీవీ ఆనంద్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు..దేశంంలో రెండు ముఖ్యమైన సమస్యలు ముందున్నాయన్నారు. ఒకటి నిరుద్యోగం, రెండు డ్రగ్స్ అని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ ను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీవీ ఆనంద్ తెలిపారు.

ఉడ్తా పంజాబ్ సినిమాలో చూపించినట్లు పంజాబ్ లో ప్రతి ఇంట్లో ఒకరు డ్రగ్స్ కు ఎడిక్ట్ అయ్యారని, అందులో ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు. ఇక్కడ కూడా డ్రగ్స్ సరఫరా సులువుగా జరుగుతుందని చెప్పారు. ఇంటర్నేషనల్ స్కూళ్లకు , కాలేజీల‌కు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు గుర్తించామని సీవీ ఆనంద్ తెలిపారు.

తనకు తెలిసిన వాళ్ల పిల్లలు కూడా డ్రగ్స్ కు బానిసయ్యారని ఆనంద్ చెప్పారు. పిల్లల పట్ల పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోని అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

Related posts