telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సీఎం కేసీఆర్ ఓ తేడా సింగ్.. ఆరోగ్య శాఖ వారికే ఇస్తారు : బండి సంజయ్

నిన్నటి రోజున గాంధీ ఆస్పత్రిలో సిఎం కెసిఆర్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో కోవిడ్ బాధితులను ఆయన పరామర్శించారు. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్, ఫార్మ్ హౌస్ దాటి సీఎం కేసీఆర్ బయటకు రావాలని బీజేపీ మొదటి నుంచి డిమాండ్ చేస్తుందన్నారు. ప్రజల విజ్ఞప్తులను కూడా తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకే టైం ఇవ్వని సీఎం..ఎట్టకేలకు ఏడేళ్ల తర్వాత బయటక వచ్చారని ఎద్దేవా చేశారు. పబ్లిసిటీ కోసమే ఇదంతా చేశారు…సీఎం కేసీఆర్ గాంధీకి వెళ్లడం పట్ల చాలా సంతోషిస్తున్నామన్నారు. గాంధీకి వెళ్లి సీఎం కేసీఆర్ ఎం సాధించారు ? వరంగల్ MGMకు ఈ రోజే ఎందుకు వెళ్లడం లేదు… అన్ని ఆరెంజ్ చేసుకున్న తర్వాత రేపు వెళ్లడం ఏంటి ? అని నిలదీశారు. టాస్క్ ఫోర్స్ కమిటీ… దొంగల ముఠా అని..సీఎం కేసీఆర్ తేడా సింగ్ అని ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 7 సార్లు గాంధీకి వెళ్లి వచ్చారని.. గాంధీలో సమస్యలను సీఎం కేసీఆర్ తెలుసుకున్నారా ? అని నిలదీశారు. ఎవరైతే సీఎం టార్గెట్ లో ఉన్నారో వారికే ఆరోగ్య శాఖ ఇస్తారని ఎద్దేవా చేశారు. వ్యాక్సినేషన్ ఎందుకు ఆపేశారు ? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి సీఎం కేసీఆర్ కొత్తగా వచ్చారా ?  బయటకు వస్తే ఇంతగా ప్రచారం ఎందుకు.. ఈ 7 ఏళ్ళు ఆయన చేసింది అంత పోయిందని పేర్కొన్నారు. రైతులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది…సబ్సిడీ తో విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు..కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు.

Related posts