telugu navyamedia
సినిమా వార్తలు

‘రాధేశ్యామ్’ నుంచి వాలెంటైన్ స్పెష‌ల్ గ్లింప్స్

పాన్ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న సినిమా రాధేశ్యామ్.. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను మార్చి 11 న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ మూవీపై అంచనాలు పెంచేశాయి. రాధేశ్యామ్ సినిమా రాబోతుండడంతో ఈ మూవీ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా..ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్-పూజా క్యూట్​గా కనిపిస్తూ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నారు.

Radhe Shyam': Makers of Prabhas-Pooja Hegde starrer release special  Valentine's Day clip

‘మళ్ళీ లైఫ్ లో వాడి మొహం చూడను’ అన్న హీరోయిన్‌ డైలాగ్‌తో ఈ వీడియో ప్రారంభమవుతుంది.  ‘మ‌న హాస్ప‌ట‌ల్‌లో మ‌న పేషెంట్స్ ముందు నీకు ముద్దు పెడ‌తాన‌ని అంటాడా?’ అని మరో డైలాగ్ కూడా ఉంది. బహుశా… పూజా హెగ్డేతో ఆమె ఫ్రెండ్ చెప్పే డైలాగ్ అయ్యి ఉంటుంది. ‘కుక్ చేస్తావ్. బాగా మాట్లాడతావ్. ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్లి ఎందుకు కాలేదు?’ అని ప్ర‌భాస్‌ను పూజా హెగ్డే అడ‌గ‌టం బావుంది.

1970ల కాలం నాటి ప్రేమకథతో రూపొందిన చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా నటించారు. ఆయన ప్రేయసి ప్రేరణగా పూజాహెగ్డే కనిపించనుంది. కృష్ణం రాజు మహాజ్ఞాని అయిన పరమహంస పాత్ర పోషించారు.

ఈ సినిమాను కృష్ణంరాజు సమర్పణలో  గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Related posts