ఇటీవల కోల్ కత్తా రైల్వే స్టేషన్ ప్లాట్ ఫార్మ్ మీద రేణూ మోండల్ అనే మహిళ “ఏక్ ప్యార్ గా నగ్మా హై” అనే సాంగ్ పాడింది. అందుకు సంబందించిన వీడియో క్షణాల్లో వైరల్ అయ్యి బాలీవుడ్ ని ఆకర్షించింది. అదికాస్తా బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ కంట పడటం, ఆయన ఆమెను పిలిపించి తన సినిమా కోసం రెండు పాటలు పాడించడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ పాట ప్రోమో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా అందరి చూపులు ఆమెపై పడ్డాయి. పనిలో పనిగా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆమెకు రూ. 55 లక్షలు విలువ చేసే ఇళ్లు బహుమతిగా ఇచ్చాడన్న వార్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కానీ అందులో ఎలాంటి నిజం లేదనీ, అది ఫేక్ న్యూస్ అని చెప్పారు రనాఘాట్‌లోని అమ్రా షోబాయ్ షోటైన్ క్లబ్ మెంబర్ విక్కీ బిశ్వాస్. ఆయన ఐఏఎన్‌ఎస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. రేణూ గారికి సల్మాన్ గారు ఫ్లాట్ ఇచ్చారన్న వార్త వట్టి కల్పిత వార్త అని ఆయన అన్నారు. కాగా రేణూ మోండల్ హిమేశ్ రిశేమియా సహజడ్జిగా వ్యవహరిస్తున్న సూపర్ స్టార్ సింగర్‌లో పాటలు పాడనున్నారు.
previous post