telugu navyamedia
సినిమా వార్తలు

యూట్యూబర్‌ వైవా హర్ష వివాహం..

ప్రముఖ కమెడియన్ , యూట్యూబర్‌ వైవా హర్ష ఓ ఇంటివాడయ్యాడు. హైదరాబాద్​కు చెందిన అక్షరతో ఆయన వివాహం ఘనంగా జరిగింది. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న హర్ష-అక్షర ఏడడుగుల పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. నగరంలోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాల్‌ ఈ వేడుకకు వేదికగా మారింది. ఏడు రోజులపాటు జరిగిన పెళ్లి వేడుకల్లో వధూవరుల కుటుంబసభ్యులు, స్నేహితులతోపాటు పలువురు సినీ ప్రముఖులు సైతం పాల్గొన్నారు.

Comedian And Youtuber Viva Harsha Got Marraied To Akshara - Sakshi

ఈ పెళ్ళి వేడుకకు దర్శకుడు మారుతి, నటుడు ప్రవీణ్‌, స్వాతి రెడ్డి, మహాతల్లి ఫేమ్‌ జాహ్నవి పాల్గొని వధూవరులకు అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

.

మరోవైపు 2014లో ‘మై నే ప్యార్ కియా’తో సినిమాలో నటించిన హర్ష…సుహాస్‌ కథానాయకుడిగా నటించిన ‘కలర్‌ఫొటో’లోనూ హర్ష తనదైన నటనతో మెప్పించారు. ఇటీవల విడుదలైన ‘గల్లీరౌడీ’లోనూ హర్ష నటించారు. ప్రస్తుతం పలు సినిమాల్లో కమెడియన్ రాణిస్తున్నారు హర్ష…

ఘనంగా వైవా హర్ష పెళ్లి.. నెట్టింట్లో ఫోటోలు వైరల్

Related posts