telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ కొత్త లుక్ వెనుక అసలు కథ…?

Nithin

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పింక్’కు ఇది రీమేక్. అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను ఇక్కడ పవన్ కళ్యాణ్ పోషిస్తుడటంతో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీకి కరోనా అడ్డంకిగా మారడంతో అప్డేట్స్ సైతం ఆగిపోయాయి. మరోవైపు డైరెక్టర్ క్రిష్ రూపొందించనున్న సినిమా కూడా ప్రస్తుతం పవన్ చేతిలో ఉంది. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో అనుమతులు లభించిన తర్వాత ‘వకీల్ సాబ్’ను పట్టాలెక్కించాలని నిర్మాత భావిస్తున్నారు. ఇక పవన్ ఇటీవల పూర్తిగా గెడ్డం, జుత్తు పెంచి కొత్త లుక్‌లోకి మారిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ క్రిష్ సినిమా కోసమే పవన్ ఇలా జుత్తు పెంచారట. ఆ సినిమాలో పవన్ కొన్ని కొత్త గెటప్‌లలో కనిపించనున్నారట. అలాగే సన్నబడడం కోసం పవన్ డైటింగ్ కూడా చేస్తున్నారట.

Related posts