telugu navyamedia
సినిమా వార్తలు

అన్ లాక్ 5.0 : అక్టోబర్ 15 నుంచి థియేటర్స్ ఓపెన్

Theatre

కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 5.ఓ గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. ఈ గైడ్ లైన్స్ లో సినిమా హాల్స్ కు మల్టీ ప్లెక్స్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. లాక్ డౌన్ కారణంగా దాదాపు 7 నెలలుగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఇక కేంద్రం ఇచ్చిన అనుమతితో అక్టోబర్ 15 నుంచి సినిమా హాల్స్, మల్టీ ప్లెక్స్ లు రీఓపెన్ కానున్నాయి. లాక్ డౌన్ కారణంగా చాలా సినిమాల రిలీజ్ లు ఆగిపోయాయి. కొన్ని సినిమాలు ఓటీటీని నమ్ముకొని విడుదల అయ్యాయి. ఇక ఇప్పుడు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిర్మాతలంతా తమ సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. షూటింగ్ దశలో ఉన్న సినిమాలు కూడా చకచకా షూటింగ్ ను పూర్తి చేసుకోనున్నాయి. దసరా, దీపావళి దగ్గరకు రావడంతో సినిమా డేట్స్ ను ఫిక్స్ చేసుకుంటున్నారు నిర్మాతలు.

Related posts