కేరళ కుట్టి పూర్ణ 2007లో “శ్రీ మహాలక్ష్మి” సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆపై “అవును” చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. తమిళ, మళయాలంలో మంచి పాత్రలను పోషించి అక్కడి ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలు లేక ఓ డ్యాన్స్ షో జడ్జ్ గా వ్యవహరిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూర్ణను పెళ్లి గురించి అడగగా ఆసక్తికర సమాధానం చెప్పింది. కొంత కాలం క్రితం కొందరు తనను చీట్ చేసారని, పెళ్లి పేరుతో తన కుటుంబాన్ని మోసం చేసారని చెప్పుకొచ్చింది. వాళ్ళు చేసిన పనికి తనకు పెళ్లంటే ఇంట్రెస్ట్ పోయిందని, ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మొద్దో తెలియకుండా పోయిందని, దీంతో పెళ్ళంటేనే భయంగా ఉందని తెలిపింది పూర్ణ. ఇక అవును, సీమటపాకాయ్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అందాల భామ పూర్ణ. పూర్ణ అసలు పేరు షామ్నాకాశిం. ఆమె పుట్టింది, పెరిగింది, చదివింది అంతా కేరళలోనే.
previous post
next post
అసభ్యపదజాలంతో రేణూదేశాయ్ పై మండిపడ్డ నెటిజన్