telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ఉదర సమస్యలకు కాకరకాయను మించిన సంజీవని లేదు… ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Bitter Gourd

చేదు అంటే ముందుగా గుర్తొచ్చేది కాకరకాయ. దీనిని ఆంగ్లంలో (Bitter gourd) అంటారు. కాకరలో నల్ల కాకర, తెల్ల కాకర, బారామాసి, పొట్టికాకర, బోడ కాకర కాయ అనే రకాలు ఉంటాయి. ఇది కూడా చేదుగానే ఉంటుంది. స్వభావం చేదైనా కమ్మని రుచులను అందించే కూరగాయ కాకరకాయ. కొంతమందికి కాకరకాయ వాసనంటేనే పడదు. కానీ కొందరు మాత్రం ఇష్టంగా తింటుంటారు. ఈ విషయం తెలిస్తే కాకరకాయ తినే అలవాటు లేకపోయినా కొత్తగా తినాలని చాలామంది అనుకుంటారేమో. కాకరగాయ వల్ల అనేక లాభాలున్నాయి.

Bitter Gourd

కాయ, కాకర రసము, కాకర ఆకులు మందుగా ఉపయోగపడతాయి. కాకరలో సోడియం, కొలెస్ట్రాల్‌ శాతం తక్కువ. థయామిన్‌, రెబొఫ్లేవిన్‌, విటమిన్‌ బి6, పాంథోనిక్‌ యాసిడ్‌, ఇనుము, ఫాస్పరస్‌లు మాత్రం పుష్కలంగా లభిస్తాయి. ఆరోగ్యాన్ని ఇచ్చే కాకర చేదు అయినప్పటికీ మధుమేహానికి మందుగా వాడుతున్నారు కాకర రసములో “హైపోగ్లసమిక్ ” పదార్ధము ఇన్‌సులిన్‌ స్థాయిలో తేడా రాకుండా నియంత్రణ చేస్తూ రక్తం లోని చెక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. కాకర గింజలలలో రక్తములో గ్లూకోజ్ ను తగ్గించే “చారన్‌టిన్‌” అనే ఇన్సులిన్‌ వంటి పదార్ధము ఉంటుంది. దీనిలో నీరు తక్కువ పౌష్టిక శక్తి ఎక్కువ. దీనిని తింటే కొంతమందికి వేడి చేస్తుంది. అలాంటి వారికి కాకరకాయను మజ్జిగలో ఉడికించి ఇవ్వొచ్చు, ఇలా మజ్జిగలో ఉరికించడం వల్ల చేదు కూడా తగ్గుతుంది.

Bitter Gourd

కాకరాకు రసమును కుక్క, నక్క మొదలగు వాటి కాటుకు విరుగుడుగా వాడతారు. కొందరు ఈ ఆకు రసమును గాయాలపై రాస్తారు. మరికొందరు దీనిని చర్మ వ్యాదులకు, క్రిమి రోగాలకు కూడా వాడతారు. కాకరకాయ అనగానే ఒక్క మధుమేహవ్యాధిగ్రస్తులకే మంచిది అనుకోకండి. ఔషధగుణాలున్న కాకరను తరచూ స్వీకరించడం వల్ల రక్త శుద్ధి జరుగుతుంది. హైపర్‌టెన్షన్‌ని అదుపులో ఉంచుతుంది ఫాస్ఫరస్‌. అధిక మొత్తంలో పీచు లభిస్తుంది. సోరియాసిస్‌ను నివారణలో కాకర కీలకపాత్ర పోషిస్తుంది. శరీరానికి అత్యావశ్యక పోషకాలైన ఫొలేట్‌, మెగ్నీషియం, పొటాషియం, జింక్‌ కూడా సమృద్ధిగా లభిస్తాయి. జీర్ణ శక్తిని వృద్ధిచేస్తుంది. దీనిలో ఉన్న మోమొకార్డిసిన్‌ యాంటి వైరస్ గా ఉపయోగపడుతుంది. ఇది ఇమ్యునో మోడ్యులేటర్ గా పని చేయడం వల్ల కాన్సర్, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మంచిది.

Bitter Gourd

వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. కాకరకాయను నీళ్లలో ఉడికించి ఆ నీటిని చల్లార్చుకుని తాగితే ఎన్నో ఇన్‌ఫెక్షన్స్ నుంచి బయటపడొచ్చు. కాకరగాయ తినడం వల్ల జలుబు, దగ్గు, అస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఈ లక్షణాలతో బాధపడేవారు కాకరగాయ రసం తాగితే మరింత మంచిది. రక్తాన్ని శుద్ధి చేయడంలో కాకరగాయ ఎంతో కీలకంగా పనిచేస్తుంది. అంతేకాదు, కాలినగాయాలు, పుండ్లను మాన్పడంలో కూడా కాకరగాయ చక్కగా పనిచేస్తుంది.
అందమైన శరీరాకృతి కోరుకునే వారు, బరువు తగ్గాలనుకునేవారు చేదుగా ఉన్నా కాకరగాయ రసం తాగాల్సిందే. కాకరకాయలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వు శాతాన్ని తగ్గించి, బరువు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తాయి. కంటి సమస్యలను తగ్గిస్తుంది. ఉదర సమస్యలకు, అజీర్ణం, కడుపులో మంట వంటి సమస్యలకు కాకరకాయ రసానికి మించిన సంజీవని లేదు. గుండెపోటుకు ఒక కారణం కొలెస్ట్రాల్. శరీరంలో కొవ్వు శాతాన్ని అదుపులో ఉంచి, గుండె సంబంధిత వ్యాధులను నియంత్రించడంలో కాకరకాయ ప్రధాన భూమిక పోషిస్తుంది. అందుకే కాకరను తరచూ తినండి. కనీసం పదిహేనురోజులకోసారైనా టీ స్పూను కాకర రసం తాగండి. అయితే గర్భిణీ స్త్రీలు కాకరను ఏ రూపములో కూడా వాడకూడదు అంటారు. అంతేకాదు కాకర గింజలలో ఉన్న “red arilis ” చిన్నపిల్లలకు చేదు విషపదార్థంగా మారే అవకాశం ఉంది.

Related posts