telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

శనివారం నుంచే .. వెస్టిండీస్‌ టీ20 సిరీస్ ..

india-westindies t20 from saturday

భారత్ వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా శనివారం నుంచే టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది. సారథి కోహ్లీతో విభేదాల విషయాన్ని పక్కనపెడితే రోహిత్‌ శర్మ ఈ పొట్టి ఫార్మాట్‌లో ఓ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. అదే టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా అందరికంటే ముందు వరుసలో నిలవడం. ప్రస్తుతానికి ఈ ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా విండీస్‌ వీరుడు క్రిస్‌ గేల్‌(105 సిక్సర్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

రెండో స్థానంలో న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ మార్టిన్‌ గప్తిల్‌(103), మూడో స్థానంలో రోహిత్‌ శర్మ(102) ఉన్నారు. విండీస్‌తో టీమిండియా మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. మరోవైపు కెనడా టీ20 లీగ్‌తో ఒప్పందం కారణంగా క్రిస్‌ గేల్ భారత్‌తో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. మరి హిట్‌మ్యాన్‌ ఈ సిరీస్‌లోనే గేల్‌ను దాటుతాడో లేదో చూడాలి. విండీస్‌ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఆగస్టు 3, 4, 6 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి.

Related posts