telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అభిమానుల ఆద్వర్యం లో సూపర్ స్టార్ మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు ” చిత్రం 50 రోజుల వేడుకలు

sarileru-mekevvaru

రాయదుర్గం :
అనంతపురం జిల్లా రాయదుర్గంలో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన గౌరవ అధ్యక్షులు సి.యన్ . నగేష్ ఆద్వర్యం లో యస్. వి. సినీ కాంప్లెక్స్ లో “సరిలేరు నీకెవ్వరు ” 50 రోజుల వేడుకలను ఘనంగా నిర్వహించారు . థియేటర్ యజమాని కుమార్ కేక్ చేసారు . పట్టణ అధ్యక్షులు బసవప్ప గౌరీ శంకర్ శాలువ, గజ మాల తో సత్కరించగా , గాజుల వెంకటేశ్వర్లు, ఎఫ్ . డి . ఆర్ట్స్ ఫక్రుద్దీన్, బి. హెచ్. ఇస్మాయిల్, శ్రీరామ్ రెడ్డి, ఆర్. లక్ష్మి నారాయణ , డాక్టర్ భూషణం , ప్. రాము తదితర అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు

విశాఖ :
విశాఖ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన డైమండ్ పార్క్ అభిమానుల ఆద్వర్యం లో సంగం శరత్ థియేటర్ లో “సరిలేరు నీకెవ్వరు ” 50 రోజుల వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధులుగా పాల్గొన్న శ్రీ శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ దిల్ శ్రీను , సంగం శరత్ థియేటర్ మేనేజర్ సుధాకర్ రెడ్డి , ప్రసాద్ రెడ్డి లు కేక్ కట్ చేయగా, 50 రోజుల షీల్డ్ అందజేసి, బాణాసంచా కాల్చి అభిమానులు తమ సంతోషం వ్యక్తం చేసారు . ఈ సందర్బంగా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ పాటలు ప్రదర్శించగా, సంగం థియేటర్ లో 5 రోజులకు కోటి రూపాయలు గ్రాస్ వాసులు చేసి రికార్డు సృష్టించిందని కే. కమల్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమం లో గౌరవ అధ్యక్షులు బాగి అప్పల రాజు రెడ్డి , ప్రెసిడెంట్ వి. సుబ్రహ్మణ్యం (బుజ్జి ) , మద్ది రాజశేఖర్ రెడ్డి , జె రి \రమేష్ రెడ్డి , ఫై. ప్రసాద్, రామ సుభాష్, మహేష్ బాబు, శ్రీకాంత్, జన చైతన్య శ్రీనివాస్ , కేబుల్ శ్రీను, మహేష్, కాకి శ్రీనివాస్ రెడ్డి, ఆప్టికల్ శ్రీను, రవి తేజ ,ఉదయ్, సంతోష్, కృష్ణ , మున్నా, నాని తదితర అభిమానులు పాల్గొన్నారు

కదిరి :
అనంతపురం జిల్లా కదిరి లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు ” 50 రోజుల వేడుకలను పట్టణ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అధ్యషులు అసిఫ్ ఆద్వర్యం లో ఘనంగా నిర్వహించారు. వేముల థియేటర్ లో కేక్ కట్ చేసి అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు

రాజమండ్రి :
తు. గో. జిల్లా రాజమండ్రి లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన ఘట్టమనేని యూత్ అధ్యక్షులు తనూజ్ ఆద్వర్యం లో సూపర్ స్టార్ మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు ” 50 రోజుల వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ చిత్రం లో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచినా నటుడు కుమారన్ సేతురామం (రమణ) కేక్ కట్ చేసి , వింటేజ్ పంపిణీ దారులు, థియేటర్ మేనేజ్మెంట్ కు షీల్డ్ అందజేసి, వృద్ధ మహిళలకు చేరాలా పంపిణి , థియేటర్ స్టాఫ్ కు కుక్కర్ లు , చిత్ర ఏజెంట్ కి సిల్వర్ గ్లాస్ ని అందజేశారు .

విజయవాడ -2:
విజయవాడ అలనార్ థియేటర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు ” 50 రోజులు పూర్త చేసుకున్న సందర్బంగా , పట్టణ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అధ్యక్షులు సుధా స్వామి ఆద్వర్యం లో 50 రోజుల వేడుకలను ఘనంగా నిర్వహించారు . వి.యస్.ఆర్.సి.ప్. సెంట్రల్ ఎమ్. యల్. ఏ . మల్లాది విష్ణు ముఖ్య అతిధి గ పాల్గొని కేక్ కట్ చేసి థియేటర్ మేనేజర్ వెంకటేశ్వర్ రావు కు షీల్డ్ అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్. యల్. ఏ. మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ వారసుడు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను సంతృప్తి పరిచే చిత్రాలతో పాటు సామాజిక సేవా దృక్పధం సందేశాలనిచ్చే చిత్రాలలో నటించి, అందరిని ఆకట్టుకుంటున్నారని , సేవ కార్యక్రమాలు చేయటం లో సూపర్ స్టార్స్ అభిమానులు మిగతా వారికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ కార్యక్రమం లో ,టైలర్ బాబు, తదితర అభిమానులు పాల్గొన్నారు

తెనాలి :
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సరిలేరు నీకెవ్వరు ” 50 రోజుల వేడుకలను తెనాలి లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు అభిమానుల ఆద్వర్యం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రియా కాంప్లెక్స్ థియేటర్ లో కేక్ కట్ చేసి, థియేటర్ యాజమాన్యానికి షీల్డ్ బహుకరించారు. సిబ్బంది కి ఈగిల్ ఫామిలీ రెస్టారెంట్ , ఈదర వెంకట పూర్ణ చందు సౌజన్యంతో బిర్యానీ పాకెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమాన్ని షావూలు సైయ్యద్ ఆద్వర్యం లో నిర్వహించగా, కే. యశ్వంత్ కుమార్, ఈ . వెంకటేశ్వర్లు, వైస్.కే. షబ్బీర్, సాయిగిరి, దామెర్ల సుబ్బారావూ, పి . రామకృష్ణ , ఎ . ఆది నారాయణ తదితర అభిమానులు పాల్గొన్నారు

చిలకలూరి పేట :
తొలిసారిగా చిలకలూరిపేట సినీ చరిత్ర లో 2 థియేటర్లు విజయ భాస్కర్, వెనటేశ్వర ల లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సరిలేరు నీకెవ్వరు ” 50 రోజులు ప్రదర్శింప బడి రికార్డు సృష్టించిన సందర్బంగా పట్టాన కృష్ణ మహేష్ యువత హెల్పింగ్ పీపుల్స్ సొసైటీ అధ్యక్షుడు ఇ . శ్రీనివాస్ రెడ్డి ఫ్రెండ్స్ సర్కిల్ ఆద్వర్యం లో విజయ భాస్కర్ థియేటర్ లో కేక్ కట్ చేసి థియేటర్ మేనేజర్ రాజా రెడ్డి కి 50 రోజుల షీల్డ్ అందించి, సిబ్బంది కి రైస్ కుక్కర్ లు పంపిణి చేసారు . ఈ సందర్బంగా బాణా సంచా కాల్చి, సంబరాలు జరుపుకున్నారు. గౌరవ అధ్యక్షులు ఎస్ . కే. నాసర్ వలి, షంషుద్దీన్, బషీర్, రామ కృష్ణ, మక్కిన శివ , అజారుద్దీన్, నటరాజ్, శివ, ప్రిన్స్, తిరుపతి నయా, దిలీప్, జిలానీ, కిరణ్, చంటి తదితర అభిమానులు పాల్గొన్నారు

గుంటూరు :
గుంటూరు నాజ్ థియేటర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు ” 50 రోజుల వేడుకలు సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన జిల్లా అధ్యక్షులు కోట శేషగిరి ఆద్వర్యం లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా హాజరయిన పాదర్తి రమేష్ గాంధీ , నజీర్ అహ్మద్, బషీర్, జాలాది రవి , ముఖ్య అతిధులుగా పాల్గొని కేక్ కట్ చేసి, థియేటర్ సిబ్బంది కి దుస్తులు , స్వీట్స్, పంపిణి చేసారు. ఈ సందర్బంగా నాజ్ థియేటర్ మేనేజర్ అహ్మద్ కు మొమెంటో అందజేసి బాణా సంచా కాల్చారు . ఈ కార్యక్రమం లో జిల్లా ఘట్టమనేని యువత అధ్యక్షులు షైక్ బాజి , పట్టాన అధ్యక్షులు కొండబోయిన శ్రీను , నాగేంద్ర , మువ్వా సుధాకర్ , యేసు , ముక్కంటి, నయీమ్ , సుభాని , వెంకట్ రావు, హరి, తదితర అభిమానులు పాల్గొన్నారు

బెంగళూరు :
బెంగళూరు థియేటర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు”50 రోజుల వేడుకలను నగర సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అధ్యక్షులు యన్ . సంజీవులు ఆధ్వర్యాల్ లో ఘనంగా జరిగింది . థియేటర్ మేనేజర్ కృష్ణప్ప కేక్ కట్ చేయగా , థియేటర్ మేనేజ్ మెంట్ కు మొమెంటో అందజేసి , సిబ్బంది కి స్వీట్స్ పంచి బాణా \సంచా కాల్చారు . ఈ కార్యక్రమం లో డి . యన్ . అశ్వత్, బాబు, రవి, రమేష్, శ్రీనివాస్(చిత్తూర్),కౌడిన్య , మహేష్ తదితర అభిమానులు పాల్గొన్నారు

అమరావతి :
నవ్యా ఆంధ్ర ప్రదేష్ , రాజధాని అమరావతి లో తొలి సారి 50 రోజులు శ్రీనివాస థియేటర్ లో ప్రదర్శింప బడిన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సరిలేరు నేకెవ్వరూ ” చిత్రం 50 రోజుల వేడుకలను అమరావతి సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు సేన అధ్యక్షులు బుల్లి బాబు ఫ్రెండ్స్ సర్కిల్ ఆద్వర్యం లో కేక్ కట్ చేసి , థియేటర్ మేనేజర్ అప్పిగట్ల సాంబశివ రావు కు షీల్డ్ అందజేశి , స్వీట్స్ పంపిణి చేసి, బాణాసంచా కాల్చారు. ఈ కార్యక్రమం లో అభిమానులు సాగర్, ప్రవీణ్, సోమయ్య, రాజేంద్ర బాబు , తదితర అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు .

విజయవాడ-1 :
అలంకార్ థియేటర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు ” 50 రోజుల వేడుకలను చంటి & రెడ్డి ఫ్రెండ్స్ సర్కిల్ ఆద్వర్యం లో టీం మహేష్ యూత్ ఫోర్స్ సాయి సాకేత్ సారధ్యం లో ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమం లో కేక్ కట్ చేసి, జిల్లా పంపిణి దారులు క్రేజీ మూవీస్ రాజేష్ , గిరి, మరియు థియేటర్ వెంకటేశ్వర్ రావు ల కు షీల్డ్ బహూకరించి బాణాసంచా కాల్చారు . అభిమానులు సూర్య , ఇబ్రహీం, మహేష్, రవి, బాషా, తదితరులు పాల్గొన్నారు .

గుడివాడ:
గుడివాడ పట్నం , బొమ్మరిల్లు థియేటర్ లో కృష్ణ మహేష్ సేన యూత్ రావుల పాటి గోపి (జూనియర్ జమదగ్ని ) ఆద్వర్యం లో సూపర్ స్టార్ మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు ” 50 రోజుల వేడుకలను ఘనంగా నిర్వహించారు . ముఖ్య అతిధి గ పాల్గొన్న యువరాజు చిత్ర దర్శకులు, థియేటర్ యజమాని వై. వి వైస్. చౌదరి కేక్ కట్ చేయగా , మేనేజర్ రూపేష్ కు మొమెంటో ను బహుకరించారు , ఈ సందర్బంగా స్వీట్స్ పంపిణి చేసి బాణాసంచా కాల్చారు . అభిమానులు పోట్ల శ్రీను , యార్లగడ్డ శశి భూషణ్, యన్ . శేషు బాబు , కేబుల్ శ్రీను, తదితర అభిమానులు పాల్గొన్నారు

అనంతపురం :
అనంతపురం లో త్రివేణి కాంప్లెక్స్ థియేటర్ లో సూపర్ స్టార్ కృష్ణ మన్న్ సేన అభిమానుల ఆద్వర్యం లో సూపర్ స్టార్ మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు ” 50 రోజుల వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి , సీనియర్ అభిమాని, మాజీ మేయర్ పరశురామ్ కేక్ కట్ చేయగా , థియేటర్ మేనేజర్ నాగరాజు కు షీల్డ్ అందజేశి , స్వీట్స్ పంపిణి చేసి , బాణాసంచా కాల్చారు . సీనియర్ అభిమానులు రవి రాజ్ , విజయ కృష్ణ, గోవింద్ రెడ్డి , షైక్ షావళి, హరి తదితర అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు

నేలకొండపల్లి :
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అధ్యక్షులు మర్రి శివ ఆద్వర్యం లో సూపర్ స్టార్ మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు ” 50 రోజుల వేడుకలను సాయి బాలాజీ థియేటర్ లో ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన జిల్లా అభిమానుల గౌరవ అధ్యక్షులు తోట రంగ రావు, సర్పంచ్ రాయపూడి నవీన్ కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలియజేసారు . ప్రధాన కార్యదర్శి యాసం శివ తో పాటు, పలువురు అభిమానులు పాల్గొని శుభాన్క్షలు తెలిపారు .

విజయవాడ – 3:
విజయవాడ నగర సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అధ్యక్షులు సీరం బుజ్జి ఆద్వర్యం లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ 50 రోజుల వేడుకలను రాజ్ యువరాజ్ కాంప్లెక్స్, అలంకార థియేటర్ లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు . ఈ కార్యక్రమం లో సప్తగిరి కృష్ణ ప్రసాద్ , కృష్ణ రావు, దుర్గ రావు, మండవ శంకర్, తదితర అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Related posts