telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లవ్ స్టోరీ : “ఏయ్ పిల్లా” మ్యూజికల్ ప్రివ్యూ

Love-Story

నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ అనే సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీని ఏషియన్ సినిమాస్ నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరపుకుంటోన్న ఈ మూవీని ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఇక ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా వాలంటైన్స్ డే సందర్భంగా మ్యూజికల్ ప్రివ్యూ అంటూ “ఏయ్ పిల్లా” సాంగ్ వీడియో ప్రోమోను విడుదల చేశారు. ఈ పాటలో నాగ చైతన్య ఎమోషన్ అవ్వడం చూస్తుంటే ఈ సినిమా ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తోంది.

Related posts