telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

రాజమౌలి కి హెచ్చరిక..థియేటర్ లపై ఆదివాసీలు దాడులు చేస్తారు

Rajamouli

బీజేపీ ఎంపీ సోయం బాపూరావు మరోసారి RRR సినిమా దర్శకుడు రాజమౌళికి వార్నింగ్ ఇచ్చారు.
RRR సినిమా లో కొమరం భీమ్ ను కించపరిచే విధంగా చిత్రీకరించారని బీజేపీ ఎంపీ బాపూరావు మరోసారి మండిపడ్డారు. కొమరం భీమ్ తలపై ఒక మతానికి చెందిన టోపీ పెట్టారని.. కళ్ళలో శూర్మా పెట్టారని..చరిత్రలో కొమరం భీమ్ ఎప్పుడు ఆ వేషధారణ లో లేరని పేర్కొన్నారు.
ఇది ఆదివాసీలను కించపరిచేలా చిత్రికరిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజమౌళి విడుదల చేసిన టీజర్ లో .. కొమరం భీమ్ నీళ్లలోంచి బైటకు వస్తూ తలపై టోపీ తో వున్నాడని తెలిపారు. రాజమౌళి తో మాట్లాడేందుకు ప్రయత్నం చేసాను..కానీ అందుబాటులోకి రాలేదన్నారు ఎంపీ సోయం బాపూరావు. రాజమౌళి కి ఇదే నా హెచ్చరిక..ఇలాగే మొండిగా సినిమా విడుదల చేస్తే…థియేటర్ లపై ఆదివాసీలు దాడులు చేస్తారని హెచ్చరించారు. కొమురం భీంను కించపరిచే సీన్స్ ఇప్పుడే తీసేయాలని..లేకపోతే దేనికి వెనుకాడమని అన్నారు. 

Related posts