భయంకరమైన ఫాన్ ఫాలోయింగ్, అంతర్జాతీయ స్థాయిలో ఇమేజ్ ఉన్న స్టార్లలో ప్రభాస్ కూడా ఉంటాడనటానికి సందేహం అక్కర్లేదు. అయితే మంచి పేరు, ప్రఖ్యతలున్న హీరోలతో షోలు చేస్తే టీఆర్‌పీ భారీగా పురుగుతోంది. ప్రస్తుతం అల్లుఅరవింద్ ఈ సూత్రాన్నే ప్రతిపాదిస్తున్నాడు. అక్కినేని సమంతా యాంకర్‌గా సామ్ జామ్ అంటూ షోను ప్రారంభించాడు. ఇందులో సమంత ఉండటంతోనే షోకు క్రేజ్ వచ్చింది. దాంతో పాటు రౌడీ విజయ్ దేవరకొండ, దగ్గుపాటి రానా, నాగ్ అశ్విన్, మెగాస్టార్ చిరంజీవి సహా మరి కొందరు ఈ షోకు వచ్చారు. ఇలా చేయడం ద్వారా ఆ హీరోల అభిమానులు ఈ షోను విపరీతంగా చూస్తారు. అయితే ఆహా స్థాయిని పెంచేందుకు అల్లు అరవిండ్ వేసిని ప్లాన్ సామ్ జామ్. ఇప్పటికే మొదలయ్యి మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ షో తరువాయి ఎపిసోడ్ల కోసం మరి కొందరు సెలబ్రటీలను కలిసారు. వారిలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నాడు. అయితే డార్టింగ్ మాత్రం ఈ షోపై అంతగా ఆసక్తి చూపలేదట. టీమ్‌తో కొంచెం టచ్‌లో ఉండండి చెప్తా అన్నాడట. స్పతహాగానే ప్రభాస్‌కు సిగ్గెక్కువ. డిజిటల్ షోల వంటి వాటికి కుదిరినంత దూరం వహిస్తాడు. ఇంతకుమందు ఒకసారి ప్రదీప్ మాచిరాజు షో కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా షోలో పాల్గొన్నాడు. ఆ తరువాత కొన్నాళ్లకు రానా, రాజమౌళితో కలిసి హిందీ షో కాఫీ విత్ కరన్‌కు వెళ్లాడు. అంతే మళ్లీ ఇప్పటి వరకు ఏ షోలోనూ కనిపించలేదు. అంతేకాకుండా ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నడు. వాటిలో రెండు పాన్ ఇండియా స్థాయి సినిమాలు. రాదే శ్యామ్ విడుదలకు సిద్దమవుతోంది. ఆ సినిమాకు ప్రమోషన్స్ చేయాలి. మరి ఆ సమయంలో ఏమైనా వస్తాడేమో చూడాలి. ఎంతైనా డార్లింగ్ మెతక మనిషి, అంత కఠినంగా ఎవ్వరికీ సమాధానం చెప్పలేడు.
previous post
next post