వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్ భారత్ ప్రపంచ పోటీని ఎదుర్కోవాలంటే భూ వినియోగాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలని అన్నారు. ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆదివారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ పలు కీలక అంశాలపై చర్చించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో నీటి సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి తదితర సవాళ్లను ప్రముఖంగా చర్చించారు. వృద్ధి రేటు పెరగాలంటే కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించాలని మాల్పస్ సూచించారు. ఇటీవల ప్రకటించిన సులభతర వాణిజ్య నివేదికలో భారత్ మెరుగైన స్థానాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
మాల్పాస్ మాట్లాడుతూ… జిల్లా స్థాయిలో వాణిజ్య కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. భూ సంస్కరణల అమలు, భూ వినియోగానికి సంబంధించిన డేటాను డిజిటలైజేషన్ చేయడం ద్వారా భూముల కొనుగోలు, అమ్మకాలు సులభతరం అవుతాయని అన్నారు. భారత్‌లో ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్టులకు సంబంధించి.. 97 ప్రాజెక్టులు, 24బిలియలన్ డాలర్ల పెట్టుబడులు కొనసాగుతున్నాయని తెలిపారు. నీతి అయోగ్ సమావేశంలో ఆస్తుల పర్యవేక్షణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశంసించారు. కాగా, మూలధన మార్కెట్‌ల ప్రోత్సహకాన్ని గొప్ప సంస్కరణగా ఆయన అభివర్ణించారు.
మూడు ముక్కలాట ఎందుకు ఆడుతున్నారు: చంద్రబాబు ఫైర్