telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

అవిసె గింజలతో ఎన్ని ఉపయోగాలో..తెలిస్తే షాక్‌ అవుతారు

అవిసె గింజలు చెక్క వల్ల జుట్టుకి కలిగే ప్రయోజనాలు ఇవే…
జుట్టు తెగి రాలిపోవ‌డాన్ని ఆపుతాయి. అవిసె గింజ‌ల్లోని ఒమెగా – 3 ఫ్యాటీ ఆమ్లాలు జుట్టులో తేమ‌ను పెంచి అవి తేమ‌తో నిండి ఉండి సిల్కీగా క‌నిపించేలా చేస్తాయి. అందుకే జుట్టు స‌మ‌స్య‌లున్న‌వారు వీటిని త‌ప్ప‌క తీసుకోవాల్సిందే. చుండ్రును అడ్డుకుంటాయి. అవిసె గింజ‌లు జుట్టుకు మంచి మాయిశ్చ‌రైజేష‌న్‌, పోష‌ణ అందించ‌డం వ‌ల్ల త‌ల కూడా ఎప్పుడూ శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండే అవ‌కాశాలు ఎక్కువ‌. దీనివ‌ల్ల చుండ్రు వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ అవుతాయి. వీటిని తిన‌డంతో పాటు అవిసె గింజ‌ల నూనె పెట్టుకోవ‌డం, మంచి షాంపూతో త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల చుండ్రు పూర్తిగా త‌గ్గిపోయే వీలుంటుంది.
బ‌ట్ట‌త‌ల రాకుండా కాపాడుతాయి. ఇటీవ‌లి కాలంలో అబ్బాయిల‌కు బ‌ట్ట‌త‌ల సమ‌స్య బాగా పెరిగిపోతోంది. మీక్కూడా ఇలాంటి స‌మ‌స్యే ఉంటే మీరు రోజూ అవిసె గింజ‌లు తీసుకోవ‌డం మంచిది. దీనివ‌ల్ల మీకు మంచి ప్ర‌యోజ‌నం ఉంటుంది. బ‌ట్ట‌త‌ల‌కు దారితీసే ఎంజైమ్‌ల‌తో పోరాడి బ‌ట్ట‌త‌ల‌ను అడ్డుకుంటాయి అవిసె గింజ‌లు.

Related posts