telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జగన్‌, పవన్‌ కళ్యాణ్‌లపై లగడపాటి సంచలన వ్యాఖ్యలు !

ఇవాళ ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే… మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో విజయవాడలో ఇవాళ మాజీ ఎంపీ లగడపాటి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా లగడపాటి సీఎం జగన్‌, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోటీ వల్లే… సంక్షేమానికి పార్టీలు పెద్ద పీట వేస్తాయని.. అభివృద్ధి, సంక్షేమంపై సమతుల్యం పాటించాలన్నారు. వైఎస్ హయాంలో సంక్షేమం, అభివృద్ధి సమంగా ఉండేవని.. ప్రభుత్వాలు తమ అవసరాల మేరకు సంక్షేమం, అభివృద్ధిలో దేనికి ఎక్కువ కేటాయించాలో నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. గెలిచినా ఓడినా పవన్ ప్రజలను అంటి పెట్టుకుని ఉండటం అభినందనీయమని.. సార్వత్రిక ఎన్నికల్లో ఓడినా… పవన్ స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగారని కొనియాడారు. రాజకీయాలకు ముందు నుంచి జగన్ తో మంచి స్నేహమని… సీఎం అవ్వాలన్న జగన్ ఆకాంక్ష నెరవేరిందని పేర్కొన్నారు. మరో మూడేళ్ళ పాలన తర్వాతే పాలన ఎలా ఉందో తెలుస్తుందని.. రాజకీయ పార్టీల మధ్య పోటీ కారణంగానే విమర్శలు వస్తాయని తెలిపారు. ఓటు ద్వారానే కోరుకున్న పాలకులు వస్తారని… ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను అన్న మాటకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. రాజకీయ సర్వేలకు దూరంగానే ఉన్నా… సామాన్యుడిగా మాత్రమే రాజకీయాలను చూస్తున్నానని పేర్కొన్నారు.

Related posts