telugu navyamedia
సినిమా వార్తలు

శృతి, తమన్నా పెళ్లి… షాకైన బాయ్ ఫ్రెండ్

క‌మల్‌హాస‌న్ ముద్దుల కూతురు, హీరోయిన్ శృతీహాస‌న్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. ఖాళీ స‌మ‌యం దొరికితే వీరిద్ద‌రూ విదేశీ యాత్ర‌ల‌కు వెళ్లడం, పార్టీలు జరుపుకోవడం, ఆ తరువాత ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటి విషయాలు తెలిసినవే. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో శ్రుతిహాసన్, త‌మ‌న్నాతో త‌న స్నేహం గురించి ప్రస్తావించింది. అందులో “నేనే క‌నుక అబ్బాయిగా పుట్టి ఉంటే.. క‌చ్చితంగా త‌మ‌న్నానే పెళ్లి చేసుకుని ఉండేదాన్ని. అంత మంచి అమ్మాయిని ఎవ‌రు వ‌దులుకుంటారు” అని శృతి హాసన్ వ్యాఖ్యానించింది. ఆ సమయంలో శృతి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. శృతి కామెంట్ గురించి తాజాగా త‌మ‌న్నా స్పందించింది. “శృతి నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆమె న‌న్ను పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పిన మాట నిజ‌మే. అదేదో స‌ర‌దాగా చెప్పింది. శృతి కామెంట్ మైకేల్ వ‌ర‌కు వెళ్లింద‌ట‌. దాంతో అత‌ను వెంట‌నే శృతికి ఫోన్ చేసి “ఏంటి నువ్వు త‌మ‌న్నాను పెళ్లి చేసుకుంటున్నావా?” అని అడిగాడ‌ట‌. అదంతా జ‌స్ట్ ఫ‌న్నీ” అంటూ చెప్పుకొచ్చింది త‌మ‌న్నా.

Related posts