telugu navyamedia
సినిమా వార్తలు

చిరు, కొరటాల సినిమాలో రంగమ్మత్త

Anasuya

బుల్లితెర పాపులర్ షోలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ యాంకర్ అనసూయ ఇటీవల రామ్ చరణ్ నటించిన “రంగస్థలం” సినిమాలో కీలకపాత్ర పోషించి మెప్పించింది. ప్రస్తుతం అనసూయ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. కొరటాల శ్రీనివాస్, చిరు కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోనే అనసూయకు అవకాశం దక్కిందనే వార్త ఫిలిం నగర్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. చిరు సినిమాలో అవకాశం కావడం, తన పాత్ర కథానాయిక పాత్రకు సమానంగా ఉండటంతో స్క్రిప్ట్ విన్న వెంటనే అనసూయ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. “సైరా నరసింహారెడ్డి” సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఈ సినిమా పట్టాలెక్కనుంది. మరి ఈ సినిమాతో అనసూయ క్రేజ్ మరింతగా పెరిగి, అవకాశాలు కూడా పెరగొచ్చు.

Related posts