telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నందమూరి-మెగా ఫ్యాన్స్ మధ్య వైరం ఆర్ ఆర్ ఆర్ తో ఫుల్ స్టాప్

chiru

అప్పట్లో సంక్రాంతి, దసరా, దీపావళి లాంటి పెద్ద పండుగలకు ఈ హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే ఫ్యాన్స్ మధ్య యుద్ధమే నడిచేది. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని చొక్కాలు చించుకుని ఫ్యాన్స్ కొట్టుకుచచ్చేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి.. యువ హీరోలు బాధ్యతతో వ్యవహరిస్తున్నారు. ఒక హీరో సినిమా ఫంక్షన్ మరో హీరో వెళ్లడం. మల్టీస్టారర్ సినిమాల్లో నటించడం. ఒక హీరో సినిమాను మరో హీరో ప్రమోట్ చేయడం ద్వారా ఈ ఫ్యాన్స్ మధ్య రగడను దాదాపు నివారించడం శుభపరిణామం. యువ స్టార్ హీరోల మధ్య ఇలాంటి మంచి వాతావరణం ఉండటం శుభపరిణామం అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. చాలా కాలంగా టాలీవుడ్‌లో నందమూరి-మెగా ఫ్యాన్స్ మధ్య వైరం ఉండనే ఉంది. వీటికి ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో పూర్తిగా ఫుల్ స్టాప్ పడినట్టే.

ఈ రెండు ఫ్యామిలీలకు చెందిన స్టార్ హీరోలో ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఈ ఇద్దరు హీరోల మధ్య ఉన్న సఖ్యతను ఫ్యాన్స్ కూడా పాటిస్తున్నారు. ఇంతకు హీరోను దెబ్బతీయాలనే ఉద్దేశంతో అతను నటించిన సినిమాను డీగ్రేట్ చేసేవారు. అయితే ఇప్పుడు అలాంటి పని చేస్తే నష్టం తమకు కూడా అనే సత్యాన్ని గ్రహించడంతో ఇండస్ట్రీలో స్నేహ పూర్వక వాతావరణం ఏర్పడింది. ఈ ఇష్యూపై చిరు మాట్లాడుతూ… హీరోల మధ్య సఖ్యత అనేది ఇండస్ట్రీకి చాలా అవసరం. ఇప్పుడు యువ హీరోలందరిలోనూ ఒకరిపట్ల ఒకరికి సఖ్యత ఉండటం మంచి పరిణామం. దాని వల్ల ఫ్యాన్స్‌లో కూడా స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. మా తరంలో కూడా మిగతా హీరోలను కలుపుకుని పోవాలని చూసేవాడిని. నా తోటి హీరోలతో స్నేహం చేయడానికి పరితపించేవాడిని ఇప్పుడు చరణ్ కూడా ఈ విషయంలో నన్ను అనుసరిస్తున్నారు. ముఖ్యంగా చరణ్-ఎన్టీఆర్‌ల మధ్య స్నేహం చూస్తే ముచ్చట వేస్తుంది. ఇలాంటి వాతావరణం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా’ అని అన్నారు మెగాస్టార్.

Related posts