telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కొత్త పెళ్లికూతురు .. సాయేషా సైగల్ .. విధులలోకి ..

sayesha saigal in shooting

సాయేషా సైగల్ అటు తెలుగు .. హిందీ భాషల్లో నటించినప్పటికీ, ఆమెకు తమిళ సినీ పరిశ్రమే మంచి ఫలితాలను ఇచ్చింది అని చెప్పాలి. తమిళంలో ఆమెకి సక్సెస్ లభించడమే కాకుండా .. అక్కడి యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. దానితో ఆమె అక్కడ సినిమాలు చేస్తూనే .. నటుడు ఆర్య ప్రేమలోపడి అతణ్ణి పెళ్లి చేసుకుంది. ఇటీవలే ఈ ఇద్దరి వివాహం వైభవంగా జరిగింది.

sayesha saigal in shootingaఆమె పెళ్లి కారణంగా విరామం తీసుకుంది. తాజాగా మళ్లీ షూటింగుకి హాజరైంది. తొలిసారిగా కన్నడలో ఆమె పునీత్ రాజ్ కుమార్ సరసన ‘యువరత్న’ సినిమాలో నటిస్తోంది. బెంగుళూరులో జరుగుతోన్న షూటింగులో ఆమె జాయిన్ అయింది. ఇక తమిళంలో ఆమె ‘కాప్పన్’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె భర్త ‘ఆర్య’ కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉండటం విశేషం. ఈ కన్నడ చిత్రంతో సాయేషా తమిళంతో పాటు కన్నడలోను బిజీ అవుతుందేమో చూడాలి.

Related posts