telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

జార్జ్ రెడ్డి … ఓ విప్లవ విద్యార్థి నాయకుడి కథ.. ట్రైలర్ ..

george reddy movie trailer

దశాబ్ధాల క్రితం విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా చరిత్రలో నిలిచిపోయిన పేరు జార్జ్ రెడ్డి. ధైర్యానికి, సాహసానికి ప్రతీకగా నిలిచిన పేరు అది. సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జ్ రెడ్డి ప్రస్థానం నేటికీ ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు ఆదర్శంగా నిలుస్తోంది. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ.. విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన జార్జి రెడ్డిని చాలా చిన్న వయసులోనే కొందరు ప్రత్యర్థులు క్యాంపస్‌లోనే హత్య చేశారు.. నేటి తరంలో చాలా మందికి తెలియని వ్యక్తి జార్జ్. ఎందరో విద్యార్తులను కదిలించిన వ్యక్తి, అలాంటి ఆదర్శనీయమైన విద్యార్థి నేత జీవితం వెండితెరపై రానుంది. గతంలో ‘దళం’ సినిమాతో ఆకట్టుకున్న జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు..ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసింది ఈ సినిమా యూనిట్. ఈ ట్రైలర్ చూస్తుంటే అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. చరిత్ర మరిచిపోయిన లీడర్ అనే విషయాన్ని ట్రైలర్‌లో నే చెప్పారు.

1965 నుంచి 1975 వరకు ఉస్మానియా యూనివర్సీటీలో చదువుకున్న ప్రతీ విద్యార్థికి జార్జ్ జీవితం గురించి తెలుసు. కానీ ఈ తరానికి జార్జ్ లాంటి టెర్రిఫిక్ లీడర్ గురించి తెలుసుకునే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ట్రైలర్ తో ఒక్కసారిగా సినిమాపై ఆసక్తి పెరిగింది. 1960-70 లలో రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను కల్లకు కట్టబోతున్న ఈ సినిమాను మైక్ మూవీస్, త్రీ లైన్స్, సిల్లీ మాంక్స్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. `వంగవీటి` ఫేమ్ సందీప్ మాధవ్ (సాండి) ఈ సినిమాలో టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు,వినయ్ వర్మ, తిరువీర్, అభయ్, ముస్కాన్, మహాతి ఇతర నటీనటులు.ప్రముఖ హీరో సత్య దేవ్ కూడా ఈ సినిమాలో ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ మరాఠీ నటి దేవిక జార్జ్ తల్లి పాత్రలో నటిస్తుండటం విశేషం. సుధాకర్ యెక్కంటి ఈ సినిమాకు ఫొటోగ్రఫిని అందించారు. ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.అతి త్వరలోనే సినిమాను రిలీజ్ చేయనున్నారు.

Related posts