telugu navyamedia
సినిమా వార్తలు

ఆస‌క్తిక‌రంగా అమితాబ్​-రష్మిక ‘గుడ్​బై’ ట్రైలర్​..

బాలీవుడ్​ దిగ్గజ న‌టుడు అమితాబ్‌ బచ్చన్‌, నేషనల్ క్రష్​ రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం గుడ్​బై. వికాస్‌ బహల్‌ దర్శకత్వం వ‌హించిన‌ ఈ సినిమా అక్టోబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్ర‌మంలో మూవీ ప్ర‌మోష‌న్లో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్​ విడుదల‌చేశారు. ఇందులో బిగ్​ బీ కట్టుబాట్లు, ఆచారాలు అనుసరించే తండ్రిగా కనిపించగా.. రష్మిక వాటిని వ్యతికేరించే కూతురిగా కనిపించింది.

మొత్తంగా ఈ ట్రైలర్​ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఏక్తా కపూర్‌ నిర్మాత. నీనా గుప్తా, సాహిల్‌ మెహతా, శివిన్‌ నారంగ్‌ ముఖ్య పాత్రలు పోషించారు.

కాగా, గుడ్‌బై సినిమా ఒక ఫ్యామిలీ డ్రామా..తల్లి అంత్యక్రియలు ఎలా చేయాలన్న విషయంపై కుటుంబ సభ్యుల మధ్య జరిగే సంఘర్షణే ప్రధాన కథాంశంగా తీసుకున్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

ఇందులో రష్మిక తల్లిదండ్రుల పాత్రల్లో అమితాబ్‌, నీనా గుప్తా నటించారు. త‌న త‌ల్లి నీనా గుప్తా అంత్య‌క్రియ‌ల‌కు రాకుండా విదేశాల్లో ఉన్న కొడుకులు త‌ప్పించుకోవ‌డం.. త‌ల్లి శ‌వాన్ని ఇంట్లో ఉండ‌గానే ర‌ష్మిక తండ్రితో గొడ‌వ‌ప‌డ‌టం ఇలా ప‌లు భావోద్వేగ స‌న్నివేశాల‌తో ట్రైల‌ర్‌ను మ‌లిచారు.

వేల ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయమిది.. అయినా ఇది బర్త్‌డే కాదు ఎలా సెలబ్రేట్‌ చేసుకోవాలనుకుంటున్నారు అని అడిగి చేయడానికి అని ఆ తండ్రి వాదిస్తారు. మొత్తానికి ట్రైలర్‌ ఆకట్టుకునేలా సాగింది.

ఓ మనిషిని సాగనంపే సమయంలో వాళ్ల ఇష్టాయిష్టాలను చూడాలా లేక సాంప్రదాయాన్ని అన్న చర్చను స్క్రీన్‌పై చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు.

Related posts