telugu navyamedia
సినిమా వార్తలు

తాగి బార్ మేనేజర్ ను చితకబాదిన బాలీవుడ్ స్టార్… అరెస్ట్

Jared

సూపర్‌ న్యాచురల్‌ ఫేం స్టార్‌ జరెడ్‌ పడలెఖీ టెక్సాస్‌లోని ఓ బార్‌ వద్ద హల్‌చల్‌ చేశాడు. మద్యం మత్తుల్లో ఉన్న జరెడ్‌ ఆస్టిన్‌లోని టెక్సాస్‌ బార్‌ ఆవరణలో బార్‌ సహాయకుడు, మేనేజర్‌ను కొట్టాడు. దీంతో రంగంలోకి దిగిన టెక్సాస్‌ పోలీసులు జరెడ్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. వీడియోలో నటుడు జరెడ్‌ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తితో గొడవ పడుతున్నట్లు కనిపిస్తోంది. సదరు వ్యక్తి పోలీసులతో మాట్లాడుతున్నట్లు మరో వీడియోలో కనిపిస్తోంది. జరెడ్‌ తరచుగా ఇదే బార్‌కు వచ్చేవాడని అక్కడి వ్యక్తులు చెప్తున్నారు. జరెడ్‌ నటించిన న్యూయార్క్‌ మినట్‌, హౌస్‌ ఆఫ్‌ వాక్స్‌ వంటి చిత్రాలతోపాటు పాపులర్‌ టీవీ సిరీస్‌ సూపర్‌ న్యాచురల్‌, గిల్మోర్‌ గర్ల్స్‌ తో చాలా పేరు తెచ్చిపెట్టాయి.

Related posts