telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈ వారం బిగ్‌ బాస్‌లో ఎలిమినేట్‌ అయ్యేది ఎవరంటే…!

Bigg-Boss-4

స్టార్ మా లో వస్తున్న తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 4 షో సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇపుడు అది ముగింపు దశకు చేరుకుంది. చివరి నాలుగు వారాల నుంచి బిగ్ బాస్ బాగా పుంజుకుంది. రేటింగ్స్ కూడా పర్లేదు అనిపిస్తున్నాయి. ఇక ఈ వారం ఒకరు, వచ్చే వారం మరొకరు ఎలిమినేట్‌ కానుండగా చివరి వారం ఐదురుగు సభ్యులు మాత్రమే హౌజ్‌లో ఉంటారు. ఈ ఐదుగురిలో ఒకరు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 విజేత అవుతారు. డిసెంబర్‌ 20 న ఫినాలే జరుగుతుందని అందరు భావిస్తుండగా.. గ్రాండ్‌ ఈవెంట్‌కి గెస్ట్‌గా జూనియర్‌ ఎన్టీఆర్‌ లేదంటే అల్లు అర్జున్‌ హాజరు అవుతారని తెలుస్తోంది. బిగ్‌బాస్‌ సీజన్‌ 4 కార్యక్రమానికి సంబంధించి 13 వ వారం చివరి దశకు చేరుకుంది. ఈ వారం ఒకరు ఎలిమినేట్‌ కానుండగా.. నామినేషన్‌లో అవినాష్‌, అఖిల్‌, మోనాల్‌, అభిజీత్‌, హారిక ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనే ఆసక్తి అందరిలో ఉంది. అయితే.. ఈ వారం అవినాష్‌ బిగ్‌ బాస్‌ హౌజ్‌ని వీడక తప్పదు అని అంటున్నారు. హౌజ్‌లో ఉన్న వారిలో అవినాష్‌ లీస్ట్‌లో ఉన్నట్టు… ఈ వారం ఎలిమినేట్‌ కానున్నట్లు సమాచారం.

Related posts