మహారాష్ట్రలోని ధూలేలో ఉన్న రసాయనిక పరిశ్రమలో పేలుడుసంభవించింది. ఆ పేలుడు ధాటికి ఎనిమిది మంది మృతిచెందగా, మరో 28 మంది గాయపడ్డారు. ఆ ప్రాంతంలో దట్టమైన నల్లటి పొగలు వ్యాపించాయి. గాయపడ్డవారిని హాస్పటల్‌కు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నది.
పేలుడు ధాటికి ఫ్యాక్టరీ ప్రాంతంలో భారీ ప్రకంపనలు వచ్చాయి. సుమారు 40 మందిని అక్కడ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. రసాయనిక ఫ్యాక్టరీ పేలడంతో కర్మాగారం నుంచి భారీ స్థాయిలో విషవాయువులు విడుదలవుతున్నాయి. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో సుమారు వంద మంది పనిచేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
మోడీ గారడి మాటలకు ఓట్లు పడవు: చంద్రబాబు