telugu navyamedia
సినిమా వార్తలు

“డిస్కోరాజా” ఫస్ట్ లుక్… సరికొత్త గెటప్ లో మాస్ మహారాజ

DIsco-Raja

వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం “డిస్కోరాజా”. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఈ ఫస్ట్ లుక్ లో రవితేజ సోఫాలో దర్జాగా కూర్చుని ఓ చేతిలో సిగార్ పట్టుకుని మరో చేతిలో గన్నుతో చిరునవ్వు చిందిస్తూ విభిన్నమైన లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. డిసెంబర్ 20, 2019న విడుద‌ల కానున్న ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మించ‌నున్నారు. ‘ఇస్మార్ట్ శంక‌ర్ ’ ఫేమ్‌ నభా నటేశ్‌ను ఓ నాయికగా, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ను మరో నాయికగా న‌టిస్తున్నారు. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. తమన్‌ స్వరకర్త. రివేంజ్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందుతుంది. గత కొంతకాలంగా రవితేజకు సరైన హిట్ లేదు. దీంతో ఆయన అభిమానులు ఈ చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నారు. మరి రవితేజ ఈ చిత్రంతోనైనా మంచి హిట్ కొట్టాలని కోరుకుందాం.

Related posts