telugu navyamedia
క్రీడలు వార్తలు

రాజస్థాన్ నిర్ణయాన్ని తప్పుబట్టిన గంభీర్…

goutham gambhir on sanju in bangladesh series

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2021 వేలానికి గత బుధవారమే ఫ్రాంచైజీలన్నీ తమ రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. అయితే ‘చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు సంజూ శాంసన్‌ను తీసుకోవడానికి చూడగా…. రాజస్థాన్ రాయల్స్ సంజూ శాంసన్‌ను రిటైన్ చేసుకోవడమే కాకుండా జట్టులో అతని స్థాయిని పెంచాలని భావించింది. అందుకే శాంసన్‌ను తమ సారథిగా ప్రకటించింది. అయితే టీమిండియా ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ రాజస్థాన్ రాయల్స్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. సంజూ శాంసన్‌ను కాకుండా బట్లర్‌ను కెప్టెన్ చేయాల్సిందన్నాడు. ‘ఇది చాలా పెద్ద నిర్ణయం. కానీ శాంసన్‌ను కెప్టెన్ చేయడం సమంజసం కాదు. ఇప్పుడిప్పుడే అతను అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. నేనే కానీ రాయల్స్ మేనేజ్‌మెంట్‌లో ఉంటే జోస్ బట్లర్‌ను కెప్టెన్ చేసేవాడిని. శాంసన్‌కు వైస్ కెప్టెన్సీ ఇచ్చేవాడిని. అతని కెరీర్‌కు ఈ సీజన్ ఎంతో ముఖ్యం. ఇప్పటికే అతనిపై అంతర్జాతీయ క్రికెట్ ఒత్తిడి ఉంది. ఈ సీజన్‌లో రాణించకుంటే భారత జట్టులో అతని స్థానాన్ని సుస్థిరం చేసుకోలేడు.’అని గంభీర్ చెప్పుకొచ్చాడు. చూడాలి మరి ఈ ఐపీఎల్ లో సంజు తన కెప్టెన్సీ బాధ్యతలు ఎలా నిర్వహిస్తాడు అనేది.

Related posts